
MadhyaPradesh: హర్దాలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురుమృతి , 59 మందికి గాయలు
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలోని బైరాగఢ్ గ్రామంలో మంగళవారం ఉదయం బాణాసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో కనీసం 6 మంది మరణించగా సుమారు 59 మంది గాయపడ్డారు.
గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు, మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు హర్దా జిల్లా మేజిస్ట్రేట్ రిషి గార్గ్ మీడియాకి తెలిపారు.
పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ చుట్టుపక్కలున్ననివాసాలు దెబ్బతిన్నాయి.దట్టమైన పొగలు,మంటలు ఆకాశంలోకి ఎగసిపడుతున్నాయి.
బెతుల్ కలెక్టర్ నరేంద్ర కుమార్ సూర్యవంశీ ఆదేశాల మేరకు, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రవికాంత్ ఉయికే నాలుగు 108 అంబులెన్స్‌లు , ఇద్దరు వైద్యులతో పాటు ఇతర సిబ్బందితో కూడిన వైద్య బృందాన్ని హర్దాకు పంపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు
VIDEO | Blast at a firecracker factory in Harda, Madhya Pradesh. More details are awaited. pic.twitter.com/MtdLjUFrQJ
— Press Trust of India (@PTI_News) February 6, 2024