తదుపరి వార్తా కథనం
Revanth Reddy: రెండేళ్ల ప్రజా పాలనకు అనుగుణంగా ప్రజల తీర్పు : సీఎం రేవంత్ రెడ్డి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 14, 2025
05:40 pm
ఈ వార్తాకథనం ఏంటి
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత హైదరాబాద్ ప్రజల్లో కాంగ్రెస్‌పై నమ్మకం పెరుగుతోందని సీఎం చెప్పారు. జూబ్లీహిల్స్‌లో విజయాన్ని అందించిన ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Details
పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు
నవీన్ యాదవ్ విజయం కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు చెప్పారు. రెండేళ్ల పాలనను ప్రజలు నిశితంగా పరిశీలించి, తమ తీర్పును ఇచ్చారనే అంశాన్ని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు.