LOADING...
PM Modi: 'ప్రజలు ఇబ్బంది పడకూడదు': ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీ సీరియస్
'ప్రజలు ఇబ్బంది పడకూడదు': ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీ సీరియస్

PM Modi: 'ప్రజలు ఇబ్బంది పడకూడదు': ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీ సీరియస్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 09, 2025
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన సంక్షోభం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనేక విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితిపై తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. డీజీసీఏ అమలు చేస్తున్న నిబంధనలు ప్రజలను వేధించడానికి కోసమే కాకుండా వ్యవస్థను మరింత మెరుగుపరచడాని కోసమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నిర్వహించిన ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన ఇండిగో సంక్షోభంపై మాట్లాడారు. నియమ నిబంధనల ఉద్దేశ్యం వ్యవస్థను క్రమబద్ధీకరించి బలోపేతం చేయడమే అయినప్పటికీ, భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

వివరాలు 

వివిధ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది

ప్రధాని చేసిన వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వెల్లడించారు. ఇండిగో సమస్య కారణంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న బాధావేదనను ఎన్డీఏ సమావేశంలో ప్రధాని ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు. గత వారం నుంచి కొనసాగుతున్న ఈ సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారు. వందల సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో వేలాది మంది వివిధ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. తిండి దొరకక, విశ్రాంతికి సరైన సౌకర్యాలు లేక ప్రయాణికులు అష్టకష్టాలు పడటం కనిపించింది. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌గా మారాయి.

Advertisement