Page Loader
Food Delivery Boy: హైదరబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. గుర్రంపై వెళ్లి ఆర్డర్ డెలివరీ ఇచ్చిన జొమాటా బాయ్
హైదరబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. గుర్రంపై వెళ్లి ఆర్డర్ డెలివరీ ఇచ్చిన జొమాటా బాయ్

Food Delivery Boy: హైదరబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. గుర్రంపై వెళ్లి ఆర్డర్ డెలివరీ ఇచ్చిన జొమాటా బాయ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2024
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

రెండు రోజులు ట్రక్ డ్రైవర్ల సమ్మె కారణంగా దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజల్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఇంధనం కొరత కారణంగా హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. డీజల్, పెట్రోల్ కోసం వాహనాలదారులు బంకుల వద్ద కీలోమీటర్ల వరకూ బారులు తీరారు. అనేక చోట్ల నో పెట్రోల్ బోర్డులు కూడా వెలిశాయి. ఇక పెట్రోల్ కోసం విసిగిపోయిన ఓ ఫుడ్ డెలవరీ బాయ్.. నూతన పద్ధతిలో డెలవరీ చేశాడు. చంచల్ గూడలో ఓ ఫుడ్ డెలవరీ బాయ్ ఏకంగా గుర్రం మీద స్వారీ చేస్తూ ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఏం ఐడియా గురు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గుర్రంపై డెలవరీ చేస్తున్న జొమోటా బాయ్