LOADING...
Fact Check: ఇ-20 పెట్రోల్‌ను భూటాన్‌ తిరస్కరించిందనే ప్రచారం అవాస్తవం: కేంద్రం
ఇ-20 పెట్రోల్‌ను భూటాన్‌ తిరస్కరించిందనే ప్రచారం అవాస్తవం: కేంద్రం

Fact Check: ఇ-20 పెట్రోల్‌ను భూటాన్‌ తిరస్కరించిందనే ప్రచారం అవాస్తవం: కేంద్రం

వ్రాసిన వారు Moogati Shabari
Jul 05, 2026
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ నుంచి 20 శాతం ఇథనాల్‌ మిశ్రమంతో తయారైన ఇ-20 (E20) పెట్రోల్‌ను భూటాన్‌ స్వీకరించలేదంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవి పూర్తిగా తప్పుడు ప్రచారమని పేర్కొంది. నిరాధార సమాచారాన్ని నమ్మకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తన అధికారిక ఎక్స్‌ ఖాతా ద్వారా వెల్లడించింది.

వివరాలు

అది అసత్య ప్రచారమేనా?

భూటాన్‌కు ఇ-20 పెట్రోల్‌ను ఎగుమతి చేయాలనే ప్రతిపాదనను దేశీయ చమురు మార్కెటింగ్‌ సంస్థలు ఇప్పటివరకు సమర్పించలేదని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే ఆ దేశానికి ఇ-20 పెట్రోల్‌ను పంపించే అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో కూడా లేదని తెలిపింది. అయినప్పటికీ, భూటాన్‌ ఇ-20 పెట్రోల్‌ను తిరస్కరించిందంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ఇటువంటి వదంతులను విశ్వసించకుండా, పెట్రోలియం మంత్రిత్వ శాఖ లేదా చమురు మార్కెటింగ్‌ సంస్థలు అధికారికంగా విడుదల చేసే సమాచారాన్నే ప్రామాణికంగా పరిగణించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్..

Advertisement