Loading...
PM Modi: ప్రధాని మోదీ పేరుతో మరో ఏఐ ఫేక్‌ వీడియో.. పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ కీలక హెచ్చరిక
పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ కీలక హెచ్చరిక

PM Modi: ప్రధాని మోదీ పేరుతో మరో ఏఐ ఫేక్‌ వీడియో.. పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ కీలక హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2026
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో సోషల్‌ మీడియాలో మరో నకిలీ వీడియో వైరల్‌గా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతున్న ఈ వీడియో పూర్తిగా అవాస్తవమని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం స్పష్టం చేసింది. ఇది కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో రూపొందించిన ఫేక్‌ వీడియో అని వెల్లడించింది. పీఐబీ వివరాల ప్రకారం, వీడియోలో చూపినట్లుగా ప్రధాని మోదీ విద్యార్థులను ఉద్దేశించి ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో ఏఐ సాంకేతికతను ఉపయోగించి సృష్టించిన నకిలీ కంటెంట్‌గా గుర్తించినట్లు తెలిపింది.

వివరాలు 

వీడియోను ఏఐ సాంకేతికతతో మార్ఫింగ్

ఇటీవల పరీక్షా విధానంలో సంస్కరణలకు సంబంధించి సూచనలు ఇవ్వడానికి ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటిస్తూ ఒక అధికారిక వీడియోను విడుదల చేశారు.

అయితే, అదే వీడియోను కొందరు ఏఐ సాంకేతికతతో మార్ఫింగ్‌ చేసి, తప్పుడు వ్యాఖ్యలు జోడించి సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు పీఐబీ వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద వీడియోలు, పోస్టులు లేదా ఇతర ఫేక్‌ కంటెంట్‌ ఎవరైనా గమనించినట్లయితే వెంటనే పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగానికి తెలియజేయాలని ప్రజలను కోరింది.

సోషల్‌ మీడియాలో కనిపించే ప్రతి సమాచారాన్ని నిజమని నమ్మకుండా, అధికారిక వనరుల ద్వారా ధృవీకరించుకున్న తర్వాతే విశ్వసించాలని సూచించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మోదీ పేరుతో వైరల్‌ పోస్టుపై పీఐబీ వివరణ

ADVERTISEMENT