Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం..లారీ-బస్సు ఢీ.. 14 మంది మృతి
అస్సాంలోని డెర్గావ్‌లో బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు 45 మందితో వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో కనీసం 14 మంది మరణించగా, 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. అథ్ఖెలియా నుండి బలిజన్‌కు 45 మంది సభ్యులతో వెళుతున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. రెండు వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన వారిని దేర్గావ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన వారిని జోర్హాట్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (జేఎంసిహెచ్)కి తరలించారు. బస్సులోని ప్రయాణించే వారిలో ఎక్కువ మంది బరలుఖువా గ్రామానికి చెందినవారు, టిన్సుకియాలోని తిలింగ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.