Tirumala: త్వరలో బ్రాండెడ్ హోటళ్ల ఏర్పాటుకు సిద్ధం.. టెండర్ల విధివిధానాలు ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీవారి భక్తులకు ఉత్తమ నాణ్యత గల ఆహారం అందించేందుకు టీటీడీ విస్తృత చర్యలు చేపట్టింది.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అందించే భోజనానికి అత్యున్నత ప్రమాణాలు పాటిస్తోంది.
ప్రస్తుతం తిరుమలలో పది పెద్ద క్యాంటీన్లు, ఆరు జనతా క్యాంటీన్లు ఉన్నాయి.
వీటిలో, నారాయణగిరి, అన్నమయ్య భవనం, బాలాజీ రెస్టారెంట్లు ఏపీ టూరిజానికి కేటాయించారు. సన్నిధానంలోని పెద్ద క్యాంటీన్‌ను ప్రైవేటు సంస్థకు అప్పగించారు.
వివరాలు
పెద్ద క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లు పేరున్న బ్రాండెడ్ హోటళ్లకు..
మిగిలిన పెద్ద క్యాంటీన్లలో అన్నపూర్ణ, హెచ్‌వీడీసీ భవనాలు, అలాగే జనతా క్యాంటీన్లలోని రెండు భవనాలు వినియోగానికి అనువుగా లేవని టీటీడీ ఇంజినీరింగ్ శాఖ అధికారులు నిర్ధారించారు.
అందువల్ల, వీటి మరమ్మతులపై సమగ్ర పరిశీలన జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలో, మిగిలిన పెద్ద క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లు పేరున్న బ్రాండెడ్ హోటళ్లకు కేటాయించే ప్రణాళికను టీటీడీ సిద్ధం చేసింది.
ఇప్పటికే లైసెన్సింగ్ విధివిధానాలను ఖరారు చేసిన టీటీడీ, త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నట్లు టీటీడీ ఎస్టేట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.