Loading...
Mp Ananth Singh: ఎమ్మెల్యే కూతురి పెళ్లిలో గందరగోళం.. అట్టముక్కలపై భోజనం చేసిన అతిథులు!
ఎమ్మెల్యే కూతురి పెళ్లిలో గందరగోళం.. అట్టముక్కలపై భోజనం చేసిన అతిథులు!

Mp Ananth Singh: ఎమ్మెల్యే కూతురి పెళ్లిలో గందరగోళం.. అట్టముక్కలపై భోజనం చేసిన అతిథులు!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2026
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌కు చెందిన ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె శివాంగి సింగ్ వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పెళ్లి వేడుకకు లక్షలాది మందిని ఆహ్వానించడంతో పాటు, అతిథుల కోసం వందలాది వంటశాలలను ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో భోజన ఏర్పాట్లు చేసినప్పటికీ, వేడుకకు వచ్చిన వారిలో చాలామందికి తగినంత ఆహారం అందలేదు. భోజనం కోసం అతిథులు పడిన ఇబ్బందులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

వివరాలు 

10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

పాట్న జిల్లాలోని నడ్వాన్ గ్రామంలో శివాంగి సింగ్ వివాహ వేడుకను భారీ స్థాయిలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, అతిథులు తరలిరావడంతో వారి వాహనాలన్నీ రహదారులపై నిలిచిపోయాయి.

దీంతో దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన దుకాణాలు, భారీగా వినిపించిన లౌడ్ స్పీకర్లతో ఆ ప్రాంతమంతా జాతరను తలపించింది.

పెళ్లి వేడుకలో భాగంగా ప్రత్యేకంగా గుర్రపు స్వారీలు, కుస్తీ పోటీలను కూడా నిర్వహించారు.

ఈ కార్యక్రమాలను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ముఖ్యంగా గుర్రపు పందేలను వీక్షించేందుకు కొందరు ప్రమాదకరంగా వ్యవహరించారు. ఏకంగా హైటెన్షన్ విద్యుత్ టవర్లపైకి ఎక్కి పోటీలను చూసేందుకు ప్రయత్నించారు.

వివరాలు 

భోజనం కోసం అతిథుల అవస్థలు

మరోవైపు, పెళ్లికి వచ్చిన సమీప ప్రాంతాల ప్రజలకు భోజనం అందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

భారీగా జనం చేరడంతో ఆహారం కోసం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

భోజనం అందించే సమయంలో ప్లేట్లను గాల్లోకి విసిరేయడంతో వాటిని అందుకునేందుకు కొందరు ఇబ్బందులు పడ్డారు.

వరద బాధితులకు ఆహారం పంపిణీ చేస్తున్నట్లుగా పరిస్థితులు కనిపించాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్లేట్లు దక్కించుకున్న వారిలోనూ చాలామందికి పూర్తిస్థాయిలో భోజనం లభించలేదు.

కొందరికి అన్నం మాత్రమే దొరకగా, మరికొందరికి కూర మాత్రమే అందింది. దీంతో అందుబాటులో ఉన్న ఆహారంతోనే సరిపెట్టుకుని చాలామంది అక్కడి నుంచి వెనుదిరిగారు.

ADVERTISEMENT

వివరాలు 

భోజనం కోసం అతిథుల అవస్థలు

లక్షలాది మందికి ఆహ్వానాలు, వందలాది వంటశాలలు, భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ అతిథులకు ఎదురైన ఈ పరిస్థితులు చర్చకు దారితీశాయి.

ఒకవైపు 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్, మరోవైపు భోజనం కోసం ప్రజల ఇబ్బందులు.. ఇలా అనంత్ సింగ్ కుమార్తె వివాహ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ పెళ్లి ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎమ్మెల్యే కుమార్తె పెళ్లిలో వింత పరిస్థితి

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పెళ్లి విందులో ప్లేట్ల కొరత.. కార్డుబోర్డులపైనే భోజనం చేసిన జనం!

ADVERTISEMENT