Telangana: రైతులకు పీఎం-కిసాన్ నిధులు.. 13న 22వ విడత విడుదల
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 11, 2026
08:40 am
ఈ వార్తాకథనం ఏంటి
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-కిసాన్ పథకం కింద నిధులు ఈ నెల 13న విడుదల కానున్నాయి. ఈ పథకం పరిధిలో 22వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలోని గువాహటిలో నిర్వహించే కార్యక్రమం ద్వారా విడుదల చేయనున్నారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా సుమారు 9.32కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,000 చొప్పున నేరుగా జమ అవుతాయని అధికారులు తెలిపారు.
వివరాలు
2019లో పీఎం-కిసాన్ ప్రారంభం
మొత్తం మీద ఈ విడతలో దాదాపు రూ.19 వేల కోట్ల నిధులు రైతులకు చేరనున్నాయి. పీఎం-కిసాన్ పథకాన్ని 2019లో మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి మూడు విడతలుగా రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేసే విధానం అమలు చేస్తున్నారు.