LOADING...
PM Kisan Yojana: పీఎం కిసాన్ డబ్బు జమ కాలేదా..? వెంటనే చెక్ చేసుకోవాల్సిన స్టెప్స్ ఇవే!
పీఎం కిసాన్ డబ్బు జమ కాలేదా..? వెంటనే చెక్ చేసుకోవాల్సిన స్టెప్స్ ఇవే!

PM Kisan Yojana: పీఎం కిసాన్ డబ్బు జమ కాలేదా..? వెంటనే చెక్ చేసుకోవాల్సిన స్టెప్స్ ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2025
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం నేడు విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేశారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులకు రూ. 20,000 కోట్ల నిధులు లభించనున్నాయి.

Details

 డబ్బు రాకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? 

మీ ఖాతాలో నిధులు జమ కాలేకపోతే, ముందుగా అధికారిక వెబ్‌సైట్ [pmkisan.gov.in](https://pmkisan.gov.in) ను సందర్శించండి. అక్కడ 'రైతు కార్నర్' విభాగంలో 'లబ్ధిదారుల స్టేటస్' అనే ఎంపికపై క్లిక్ చేయాలి. అనంతరం మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి డబ్బు స్టేటస్ తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నంబర్ తెలియకపోతే? మీకు రిజిస్ట్రేషన్ నంబర్ గుర్తు లేకపోతే 'Know Your Registration Number' ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అక్కడ ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, సంబంధిత వివరాలను పొందొచ్చు.

Details

eKYC లేదా బ్యాంక్ సమస్యలే కారణమా?

అడిగినవారు eKYC ప్రక్రియను పూర్తి చేయకపోతే లేదా బ్యాంక్ అకౌంట్, ఆధార్ నంబర్ వివరాలను సరిగ్గా నమోదు చేయకపోతే నిధులు జమ కానే అవకాశముంది. అందువల్ల డబ్బు రాకపోతే ఈ అంశాలపై ఒకసారి తనిఖీ చేయడం మంచిది. అధికారులను సంప్రదించాలంటే ఇమెయిల్: [pmkisan-ict@gov.in](mailto:pmkisan-ict@gov.in) హెల్ప్‌లైన్ నంబర్లు: 155261, 1800-11-5526 (టోల్ ఫ్రీ) 011-23381092 ఈ సమాచారంతో రైతులు తమ నిధుల స్థితి, సమస్యలు తెలుసుకోగలుగుతారు. పీఎం కిసాన్ యోజన ద్వారా అందుతున్న నిధులు నిర్దిష్టమైన ప్రక్రియల్లో ఎటువంటి పొరపాట్లుండకూడదన్నదే ప్రభుత్వ ఆశయం.