 
                                                                                PM Modi: ఐక్యతా విగ్రహం దగ్గర వల్లభాయ్ పటేల్‌కు మోదీ నివాళి
ఈ వార్తాకథనం ఏంటి
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. నర్మదా జిల్లాలోని ఏక్తానగర్ సమీపంలో ఉన్న 182 మీటర్ల ఎత్తైన ఐక్యతా విగ్రహం వద్ద ఉదయం 8 గంటలకు ప్రధాని మోదీ చేరుకుని పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞను చేయించి, దేశ ప్రజలలో ఐక్యతా స్పూర్తిని నింపారు. ఈ కార్యక్రమంలో ఆకర్షణీయమైన కవాతు, సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి.
వివరాలు
మహిళల ఆధ్వర్యంలో పరేడ్
కార్యక్రమం ప్రారంభంలో "ఏక్తా పరేడ్" ప్రారంభోత్సవం జరిగింది. ఈ పరేడ్ మొత్తం మహిళల ఆధ్వర్యంలో జరిగింది. గార్డ్ ఆఫ్ ఆనర్, ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాలు మహిళలు సమర్థంగా నిర్వహించారు. పోలీసులు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC), బ్యాండ్ బృందాలు, గుర్రాలు, ఒంటెలు, కుక్కలతో కూడిన మౌంటెడ్ దళాలు పాల్గొన్నాయి. అలాగే మహిళల ఆయుధ కసరత్తులు, మార్షల్ ఆర్ట్స్, డేర్‌డెవిల్ మోటార్‌సైకిల్ విన్యాసాలు, నిరాయుధ పోరాట ప్రదర్శనలు, ఎన్‌సీసీ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ రాష్ట్రాల శకటాలు, పాఠశాల బ్యాండ్ ప్రదర్శనలు, భారత వైమానిక దళం నిర్వహించిన వైమానిక ప్రదర్శనతో వేడుకలు మరింత ఘనంగా జరిగాయి.
వివరాలు
దేశ సమైక్యతకు ఆయన అజేయ శక్తి
ఇదిలా ఉంటే ఐక్యతా విగ్రహం దగ్గరకు వెళ్లకముందు మోడీ ఎక్స్‌లో కీలక పోస్ట్ చేశారు. "సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారతదేశం ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తోంది. దేశ సమైక్యతకు ఆయన అజేయ శక్తిగా నిలిచారు. జాతీయ సమగ్రత, సుశాసనం, ప్రజా సేవ పట్ల ఆయన చూపిన అచంచలమైన నిబద్ధత తరతరాలకి ప్రేరణగా నిలుస్తూనే ఉంది. ఐక్యమైన, బలమైన, స్వావలంబన భారతదేశం అనే ఆయన కలను సాకారం చేయడమే మన సమిష్టి లక్ష్యం." అని మోదీ పేర్కొన్నారు.
వివరాలు
సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబ సభ్యులను కలిసిన మోదీ
ఇక గురువారం ఏక్తానగర్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబ సభ్యులను కూడా ప్రధాని మోదీ కలుసుకున్నారు. సర్దార్ పటేల్ మనవడు గౌతమ్ పటేల్, ఆయన భార్య నందిత, కుమారుడు కేదార్, కోడలు రీనా, మనవరాలు కరీనాతో ప్రధాని మాట్లాడారు. "కెవాడియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబాన్ని కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. వారితో సంభాషించడం ద్వారా సర్దార్ పటేల్ దేశానికి చేసిన అసాధారణ సేవలను మరల గుర్తుచేసుకున్నాను." అని అని మోదీ ఎక్స్‌లో రాశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వల్లభాయ్ పటేల్‌కు మోదీ నివాళి
#WATCH | Ekta Nagar, Gujarat: Prime Minister Narendra Modi pays tribute to Sardar Vallabhbhai Patel at the Statue of Unity, on 'Rashtriya Ekta Diwas', celebrated in his honour on his birth anniversary.
— ANI (@ANI) October 31, 2025
(Video: DD) pic.twitter.com/KLZhQxbhg9