Page Loader
ఒకే వేదికపై నరేంద్ర మోదీ, శరద్ పవార్.. లోకమాన్య తిలక్ అవార్డు అందుకున్న ప్రధాన మంత్రి
లోకమాన్య తిలక్ అవార్డు అందుకున్న ప్రధాన మంత్రి

ఒకే వేదికపై నరేంద్ర మోదీ, శరద్ పవార్.. లోకమాన్య తిలక్ అవార్డు అందుకున్న ప్రధాన మంత్రి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 01, 2023
06:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు విపక్ష కూటమి ఇండియాలోని కీలకనేత శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోదీతో వేదికను పంచుకున్నారు. పుణెలో జరిగిన లోకమాన్య తిలక్​ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ఒకే వేదికలో ఆసీనులయ్యారు. ఈ మేరకు ది తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ (హింద్ స్వరాజ్ సంఘ్) నుంచి లోక్​మాన్య తిలక్ నేషనల్ అవార్డును మోదీ అందుకున్నారు. అంతకుముందు ఆయన తిలక్​కు నివాళులు అర్పించారు. అనంతరం పురస్కారం స్వీకరించారు. పురస్కారం 140 కోట్ల భారతీయులకు అంకితమిచ్చిన మోదీ, దాని ద్వారా వచ్చిన ప్రైజ్​మనీని నమామీ గంగేకు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. మరోవైపు పుణె మెట్రోలో 2 కారిడార్లకు మోదీ జెండా ఊపి ప్రారంభించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లోకమాన్య తిలక్ అవార్డు అందుకున్నఅనంతరం మాట్లాడుతున్న ప్రధాని