PM Modi: రూ.41,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ
రూ.41,000కోట్ల విలువైన దాదాపు 2,000 రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. 'ప్రధాన్ మంత్రి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్' కింద 553 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉన్న రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్ ఇప్పుడు చిన్న చిన్న కలలు కనడం మానేసిందన్నారు. ఇప్పుడు భారీ కలనను ప్రారంభించిందన్నారు. ఆ కలలను సాకారం చేసుకునేందుకు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు. రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలను నివారించడానికి రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లను రైల్వే శాఖ నిర్మించనుంది.