Pm Modi: బెంగాలీయులకు 6 హామీలు ప్రకటించిన మోదీ..
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో కీలక హామీలు ఇచ్చారు. పూర్బా మేదినీపూర్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, కేంద్రం-రాష్ట్రం కలిసి పనిచేస్తేనే ప్రజలకు గరిష్ట లాభాలు అందుతాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బెంగాల్ ప్రజలకు ఆరు ప్రధాన హామీలను ప్రకటించారు.
వివరాలు
మోదీ ప్రకటించిన ఆరు హామీలు ఇవే..
బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో భయాందోళన వాతావరణాన్ని తొలగించి, న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంపొందిస్తామని తెలిపారు. పరిపాలన పూర్తిగా జవాబుదారీతనంతో పనిచేసేలా మారుస్తామని చెప్పారు. అవినీతి, అక్రమాలు, మహిళలపై జరిగిన దాడులు, అత్యాచార కేసులు సహా అన్ని అంశాలను మళ్లీ సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. టీఎంసీ పాలనలో అవినీతికి పాల్పడిన వారెవరైనా చట్టం ముందు తప్పించుకోలేరని హెచ్చరించారు. శరణార్థులకు రాజ్యాంగ హక్కులు కల్పిస్తామని, అయితే చొరబాటుదారులను దేశంలో ఉండనివ్వబోమని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 7వ వేతన సంఘం సిఫారసులను అమలు చేస్తామని ప్రకటించారు.
వివరాలు
మోదీ ప్రకటించిన ఆరు హామీలు ఇవే..
ప్రస్తుతం బెంగాల్‌కు 'డబుల్ ఇంజిన్ ప్రభుత్వం' అత్యవసరమని మోడీ పేర్కొన్నారు. కేంద్రం-రాష్ట్రం కలిసి పనిచేస్తే మత్స్య రంగం, సముద్ర ఆహార రంగాల్లో రాష్ట్రం స్వయం సమృద్ధి సాధిస్తుందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో వేగంగా, సమర్థంగా అమలవుతాయని మోడీ హామీ ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతున్నాయి. మొత్తం 294 స్థానాలకు గాను, తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 23న 152 స్థానాలకు, రెండో విడత ఏప్రిల్ 29న 142 స్థానాలకు జరుగుతుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
డబుల్ ఇంజిన్‌తో అభివృద్ధి: మోదీ
#WATCH | Purba Medinipur, West Bengal: While addressing a public gathering, Prime Minister Narendra Modi says, "Bengal's best interest does not lie in animosity towards the Prime Minister; rather, the people stand to gain the most if both the Prime Minister and the Chief Minister… pic.twitter.com/YlMvGIq8O7
— ANI (@ANI) April 9, 2026