LOADING...
PM Modi: తమిళనాడు సీఎంగా విజయ్‌కు శుభాకాంక్షల వెల్లువ..ప్రధాని మోదీ అభినందనలు
తమిళనాడు సీఎంగా విజయ్‌కు శుభాకాంక్షల వెల్లువ..ప్రధాని మోదీ అభినందనలు

PM Modi: తమిళనాడు సీఎంగా విజయ్‌కు శుభాకాంక్షల వెల్లువ..ప్రధాని మోదీ అభినందనలు

వ్రాసిన వారు Moogati Shabari
May 10, 2026
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీవీకే అధ్యక్షుడు విజయ్‌విజయ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో రాష్ట్ర పాలన విజయవంతంగా కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర పురోగతి కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.

వివరాలు

రేవంత్ రెడ్డి అభినందనలు..

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కు శుభాకాంక్షలు. ఈ ఎన్నికల ఫలితం సమాజంలో యువత స్వరానికి పెరుగుతున్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన విజయ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రజలకు సమానత్వం, సంక్షేమం ప్రధానంగా ఉండే పరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement