PM Modi: యుద్ధాలతో చమురు ధరలు పెరుగుతున్నాయి.. దేశం ఐక్యంగా ముందుకు సాగాలి: మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. గత నెల రోజులుగా దేశం పలు కీలక విజయాలను సాధించిందని పేర్కొంటూ, యువత ప్రతిభ దేశానికి గర్వకారణంగా నిలుస్తోందని అన్నారు. స్కైరూట్ విజయంతో భారత యువశక్తి మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని, కేవలం 28 ఏళ్ల యువకులు ఈ ఘనత సాధించడం దేశ భవిష్యత్తుకు మంచి సంకేతమని కొనియాడారు. యువత కేవలం సాహసాలకు మాత్రమే పరిమితం కాకుండా విజయాలను కూడా అందుకుంటోందని తెలిపారు.
వివరాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రజాస్వామ్యానికి కీలకం: మోదీ
దేశాభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రస్తావించిన మోదీ, రాజస్థాన్‌లో కొత్త ఆయిల్ రిఫైనరీని దేశానికి అంకితం చేశామని చెప్పారు.
అలాగే సెమీకండక్టర్ ప్లాంట్ ప్రారంభంతో పాటు గ్రీన్ హైడ్రోజన్ రైలును కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు.
దేశాన్ని సాంకేతికంగా, పారిశ్రామికంగా మరింత బలోపేతం చేసే దిశగా ఈ ప్రాజెక్టులు కీలకమని పేర్కొన్నారు.
వర్షాకాలం రైతులకు ఎంత ముఖ్యమో, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా ప్రజాస్వామ్యానికి అంతే కీలకమని మోదీ అన్నారు.
వర్షాలు సమృద్ధిగా కురిసి, పార్లమెంట్ సమావేశాలు కూడా సజావుగా సాగితే దేశ సంక్షేమానికి, ప్రజల శ్రేయస్సుకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.
ఈ సమావేశాలు కార్యసాధకంగా, ఫలవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు.
వివరాలు
భారత్ 7.7శాతం వృద్ధిరేటు
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాల ప్రభావంపై కూడా ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.
యుద్ధాల కారణంగా అనేక దేశాలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయని,అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఇలాంటి క్లిష్టపరిస్థితుల మధ్య కూడా భారత్ 7.7శాతం వృద్ధిరేటును నమోదు చేయడం సానుకూల పరిణామమని అన్నారు.
దేశాభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని,పార్లమెంట్ సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అన్ని పార్టీలు సహకరించాలని పిలుపునిచ్చారు.
ఇక నేటి నుంచి ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. తొలి రోజే పలు కీలక బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది.
వందేమాతరం గేయాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణిస్తూ,మూడేళ్లవరకు జైలుశిక్ష విధించే ప్రతిపాదనతో కూడిన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.
వివరాలు
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపుపై ఆర్డినెన్సు స్థానంలో కొత్త బిల్లు
అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38కు పెంచే ఆర్డినెన్సు స్థానంలో కొత్త బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
అదే సమయంలో గత ఏప్రిల్‌లో జరిగిన మూడు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించక ఆమోదం పొందలేకపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఈసారి ఎలాగైనా ఆమోదింపజేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ల అమలును ఒకే రాజ్యాంగ సవరణ బిల్లులో చేర్చి సభ ముందుకు తీసుకురానుంది.
వివరాలు
'మిషన్ 360'పై ప్రత్యేక దృష్టి
ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన సంఖ్యాబలం సమీకరించేందుకు బీజేపీ 'మిషన్ 360'పై ప్రత్యేక దృష్టి సారించింది.
సభలో హాజరయ్యే సభ్యుల సంఖ్య ఆధారంగా మూడింట రెండొంతుల మెజారిటీ లెక్క మారే అవకాశం ఉండటంతో, కనీసం 360 మంది ఎంపీల మద్దతు సాధించాలనే వ్యూహంతో ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తోంది.
ప్రస్తుతం దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు తమకు అనుకూలంగా మారుతున్నాయని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పార్లమెంట్ ఆవరణలో మాట్లాడుతున్న ప్రధాని
#WATCH | Delhi: On the Monsoon session of Parliament, PM Narendra Modi says, "Be it the monsoon or the monsoon session- if both are proactive, they prove to be highly productive. And when both are productive, it leads to the welfare of the nation and the well-being of all living… pic.twitter.com/xuQmzDTeQw
— ANI (@ANI) July 20, 2026