LOADING...
PM Modi: దేశంలో మరో నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
దేశంలో మరో నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi: దేశంలో మరో నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2025
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో రైలు రవాణా రంగం మరో అడుగు ముందుకు వేసింది. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు కొత్త వందే భారత్‌ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు వారణాసి-ఖజురహో, లక్నో-సహరాన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో నడవనున్నాయి. ఇవి ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే కాకుండా, పర్యాటకాభివృద్ధికి కూడా దోహదం చేయనున్నాయి.

Details

వారణాసి-ఖజురహో వందే భారత్

ఈ రైలు వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, ఖజురహో వంటి మతపరమైన, సాంస్కృతిక ప్రాధాన్యత గల నగరాలను కలుపుతుంది. ప్రస్తుత రైళ్లతో పోలిస్తే సుమారు 2 గంటల 40 నిమిషాల సమయం ఆదా అవుతుంది. యాత్రికులు, పర్యాటకులు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఖజురహో చేరడానికి ఈ రైలు సౌకర్యవంతమైన మార్గం కానుంది. లక్నో-సహరాన్‌పూర్ వందే భారత్‌ ఈ రైలు మొత్తం ప్రయాణాన్ని కేవలం 7 గంటల 45 నిమిషాల్లో పూర్తిచేస్తుంది. ఇది సుమారు 1 గంట సమయం ఆదా చేయనుంది. లక్నో, సీతాపూర్, షాజహాన్‌పూర్, బరేలీ, మొరాదాబాద్, బిజ్నోర్, సహారాన్‌పూర్ వంటి ప్రధాన నగరాలను కలుపుతుంది. ఈ మార్గం ద్వారా రూర్కీ-హరిద్వార్‌ sచేరడం కూడా మరింత సులభం కానుంది.

Details

ఫిరోజ్‌పూర్-ఢిల్లీ వందే భారత్

ఉత్తర భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఈ రైలు కేవలం 6 గంటల 40 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, బటిండా, పాటియాలా వంటి ముఖ్య నగరాలను ఢిల్లీతో కలుపుతుంది. ఈ రైలు వాణిజ్యం, ఉపాధి, పర్యాటక రంగాలకు కొత్త అవకాశాలను సృష్టించడమే కాకుండా, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది.

Details

 ఎర్నాకులం-బెంగళూరు వందే భారత్

దక్షిణ భారతదేశంలో ఈ రైలు ప్రయాణ సమయాన్ని రెండు గంటలకు పైగా తగ్గించి, కేవలం 8 గంటల 40 నిమిషాల్లో గమ్యానికి చేరుకునేలా రూపొందించారు. ఇది కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఉన్న ఐటీ, వాణిజ్య కేంద్రాలను అనుసంధానించే కీలక మార్గంగా నిలుస్తుంది. ఈ రైలు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి, పర్యాటకాన్ని పెంపొందించడంలో ప్రధాన పాత్ర పోషించనుంది. మొత్తం మీద, ఈ నాలుగు కొత్త వందే భారత్‌ రైళ్లు భారత రైల్వే ఆధునికత, వేగం, సౌకర్యం వైపు తీసుకున్న మరో ముందడుగు అని చెప్పవచ్చు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జెండా ఊపి ప్రారంభిస్తున్న మోదీ