Rashtriya Prerna Sthal: రాష్ట్రీయ ప్రేరణ స్థల్ ప్రారంభించిన ప్రధాని మోదీ..
ఈ వార్తాకథనం ఏంటి
లక్నోలో కొత్త రాష్ట్రీయ ప్రేరణ స్థలం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంలో ఆయన శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్ పేయిల విగ్రహాలను అధికారికంగా ఆవిష్కరించారు. రాష్ట్రీయ ప్రేరణ స్థలంలో ఈ మహానేతల 65 అడుగుల ఎత్తులో విగ్రహాలు ప్రతిష్టాపించబడ్డాయి ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ భారత జాతీయ ప్రయాణం,నాయకత్వ వారసత్వాన్ని గుర్తిస్తూ,మహానుభావుల వారసత్వాన్ని గౌరవించడం,కాపాడడం కేంద్ర ప్రభుత్వ కర్తవ్యం అని చెప్పారు. శ్యామప్రసాద్,దీన్ దయాళ్ కలల సాధన కోసం సంకల్పపూర్వకంగా ముందుకు సాగాలని ప్రజలకు సూచించారు.
వివరాలు
ప్రజల కృషితోనే వికసిత్ భారత్ సాకారం..
నేతల విగ్రహాల ఎత్తు మాత్రమే కాదు, వాటి ద్వారా వచ్చే ప్రేరణ ఎంతో గొప్పదని ఆయన వెల్లడించారు. ప్రజల కృషి వల్లనే భారత్ అభివృద్ధి సాధించిందని, రాష్ట్రీయ ప్రేరణ స్థలం ప్రతి అడుగుతో జాతి నిర్మాణం దిశగా స్ఫూర్తి ఇస్తుందని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ,వాజ్ పేయి, మదన్ మోహన్ మాలవ్య భారత ఏకత్వానికి కృషి చేశారు అని గుర్తు చేశారు. శ్యామప్రసాద్,దీన్ దయాళ్,అటల్ బిహారీ వాజ్ పేయిల విగ్రహాలు ప్రజలకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయని చెప్పారు. అటల్ బిహారీ వాజ్ పేయి నాయకత్వంలో గ్రామాల రోడ్ల నిర్మాణానికి పునాది వేసినట్లు, గత 11 ఏళ్లలో భారత్ అత్యంత పెద్ద మొబైల్ ఫోన్ల ఉత్పత్తి కేంద్రంగా ఎదిగినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.