తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ
కన్నతల్లి అంత్యక్రియలు ముగిసి... రెండు గంటలు కూడా గడవలేదు, అప్పుడే విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. తల్లి చనిపోయిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభించారు. అనంతరం దీన్ని జాతికి అంకితం ఇచ్చారు ప్రధాని మోదీ. ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు హౌరా నుంచి న్యూ జల్‌పాయిగుఢి మధ్య నడవనుంది. వాస్తవానికి శుక్రవారం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రారంభించడానికి ప్రధాని కోల్‌కతాకు వెళ్లాల్సి ఉంది. రైలు ప్రారంభోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారుల అప్పటికే పూర్తి చేశారు. అయితే తెల్లవారుజామున తన తల్లి మరణించడంతో ఉదయం నేరుగా అహ్మదాబాద్ చేరుకుని.. అంత్యక్రియలకు హాజరయ్యారు మోదీ.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రత్యేకతలు
ఇది పశ్చిమ బెంగాల్‌లో మొదటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కాగా.. దేశంలో ఏడోది మిగతా రైళ్లతో పోలిస్తే.. ఇందులో ప్రయాణిస్తే.. మూడు గంటలు ఆదా అవుతుంది 7.45 నిమిషాల్లో 564కిలో మీటర్లు ప్రయాణిస్తుంది ఈ ట్రైన్‌లో 16కోచ్ ఉంటాయి.. ఇద్దరు డ్రైవర్లు ఉంటారు ఈశాన్య రాష్ట్రాల ప్రయాణికులకు ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు చాలా అనువుగా ఉంటుంది. అందుకే దీన్ని ఈశాన్యానికి గేట్ వేగా చెబుతున్నారు ఈ రైలు ఉదయం 6 గంటలకు హౌరా స్టేషన్‌నుంచి బయలుదేరి న్యూ జల్‌పాయిగుఢి స్టేషన్‌కు మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకుంటుంది. అక్కడ ఒక గంట ఆగి.. తిరిగి బయలుదేరుతుంది. రాత్రి 10 గంటలకు మళ్లీ హౌరా చేరుకుంటుంది.