Debendra Pradhan: కేంద్ర మాజీ మంత్రి దేబేంద్ర ప్రధాన్ కన్నుమూత.. ప్రధాని మోదీ నివాళి
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఆయన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి దేబేంద్ర ప్రధాన్ (Debendra Pradhan) కన్నుమూశారు.
84 ఏళ్ల వయసున్న ఆయన అనారోగ్య కారణంగా సోమవారం తుదిశ్వాస విడిచారు.
ఈ నేపథ్యంలో అనేక మంది రాజకీయ నేతలు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కూడా దేబేంద్ర ప్రధాన్ భౌతికకాయానికి నివాళులర్పించారు.
అదేవిధంగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
వివరాలు
కేంద్ర మంత్రిగా విధులు
అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో దేబేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తించారు.
అదనంగా, ఒడిశా బీజేపీ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ఆయన మృతి గురించి ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ (Mohan Charan Majhi) స్పందిస్తూ, దేబేంద్ర ప్రధాన్ ప్రజా నాయకుడిగా, సమర్థవంతమైన పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారని కొనియాడారు. 1999 నుంచి 2001 వరకు కేంద్ర రవాణా, వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధిగా, పార్లమెంటు సభ్యుడిగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్లు ఆయన ప్రశంసించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దేబేంద్ర ప్రధాన్ భౌతికకాయానికి నివాళులర్పించిన ప్రధాని
#WATCH | Delhi | PM Modi pays last respects to former Union Minister Dr Debendra Pradhan who passed away at the age of 84.
— ANI (@ANI) March 17, 2025
Dharmendra Pradhan, the son of former Union Minister and late Dr Debendra Pradhan, present.
(Video source: DD) pic.twitter.com/6MynfHzaWB