PM Modi : ప్రధానికి స్వీడన్ అత్యున్నత పురస్కారం.. ఆసియాలోనే మొదటి నేతగా మోదీ రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం లభించింది. యూరప్ పర్యటనలో భాగంగా స్వీడన్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన "రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్-కమాండర్ గ్రాండ్ క్రాస్"పురస్కారంతో మోదీని సత్కరించింది. స్వీడన్ యువరాణి విక్టోరియా స్వయంగా ఈ అవార్డును ప్రధాని మోదీకి అందజేశారు. విదేశీ దేశాధినేతలకు స్వీడన్ ప్రదానం చేసే అత్యంత గౌరవప్రదమైన పురస్కారం ఇదే . ఈ గౌరవాన్ని అందుకున్న తొలి ఆసియా దేశ నాయకుడిగా నరేంద్ర మోదీ కొత్త చరిత్ర సృష్టించారు. 1748లో ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీడన్ ప్రయోజనాల కోసం లేదా అంతర్జాతీయ సంబంధాల అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ప్రముఖులకు మాత్రమే ప్రదానం చేస్తారు.
వివరాలు
31కి చేరిన అవార్డులు
మోదీ నాయకత్వంలో భారత్-స్వీడన్ సంబంధాలు మరింత బలపడటంతో పాటు, ముఖ్యంగా హరిత ఇంధనం, సాంకేతిక రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారం పెరిగిందని స్వీడన్ ప్రభుత్వం ప్రశంసించింది. ఈ అవార్డుతో కలిపి ప్రధాని మోదీకి ఇప్పటివరకు ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ప్రదానం చేసిన గౌరవాల సంఖ్య 31కి చేరింది. అంతకుముందు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, భూటాన్ వంటి దేశాలు కూడా తమ అత్యున్నత పురస్కారాలతో మోదీని సత్కరించాయి. స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌కు బదులుగా గోథెన్‌బర్గ్ నగరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్పందించిన ప్రధాని మోదీ.. ఈ గౌరవాన్ని దేశంలోని 140కోట్ల భారతీయులకు అంకితం చేస్తున్నానని తెలిపారు.
వివరాలు
ఇరు దేశాల మధ్య కీలక చర్చలు
భారత్-స్వీడన్ దేశాల మధ్య ఉన్న బలమైన స్నేహానికి ఈ పురస్కారం ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మోదీ స్వీడన్ పర్యటన కేవలం అవార్డు స్వీకరణకే పరిమితం కాలేదు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే దిశగా కీలక చర్చలు జరిగాయి. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్‌తో జరిగిన సమావేశంలో హరిత హైడ్రోజన్, కృత్రిమ మేధస్సు, రక్షణ రంగం, అంతరిక్ష పరిశోధనలపై పలు ముఖ్య ఒప్పందాలు కుదిరాయి. అలాగే స్వీడన్‌కు చెందిన ప్రముఖ సంస్థల ప్రధాన అధికారులతో సమావేశమైన మోదీ.. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ పర్యటనతో యూరప్ మార్కెట్‌లో భారత సాంకేతిక సంస్థలకు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అవార్డు స్వీకరిస్తున్న మోదీ
STORY | PM Modi receives Sweden's prestigious award Royal Order of Polar Star
— Press Trust of India (@PTI_News) May 17, 2026
Prime Minister Narendra Modi was on Sunday conferred with Sweden's Royal Order of Polar Star, the highest honour awarded to a Head of Government by the Scandinavian nation.
READ |… https://t.co/hEYifRWe93