
PM Modi: 'అనుష్ఠానం'లో భాగంగా.. రోజూ గంటకుగా ప్రత్యేక మంత్రాన్ని జపిస్తున్న మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) 11 రోజుల పాటు 'అనుష్ఠానం (anushthaan)' చేపట్టారు.
ఈ దీక్షను మోదీ చాలా కఠిన నియమాలతో నిష్టగా చేస్తున్నారు.
దీక్షలో భాగంగా ఉపవాసం చేస్తున్న మోదీ కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారు.
అంతేకాదు, నేలపైనే నిద్రపోతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అంతే కాకుండా మోదీ 'గోపూజ' కూడా చేస్తున్నారు. ఆవులకు మేత పెట్టడం, అన్నం పెట్టడం వంటి పలు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
మోదీ
ప్రతిరోజు ప్రత్యేక మంత్రాన్ని జపిస్తున్న మోదీ
దీక్షలో భాగంగా ప్రధాని మోదీ హిందూ మత పెద్దల నుంచి ఒక మంత్రాన్ని స్వీకరించారు.
ప్రధాని మోదీ ప్రతి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో ఒక గంట, 11 నిమిషాల పాటు మంత్రాన్ని జపిస్తారు.
'అనుష్ఠానం' కార్యక్రమంలో ఈ శ్లోకాన్ని పఠించడం అనేది చాలా కీలకమైనది.
తన షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికీ అన్ని ఆచారాలను కఠినంగా పాటించాలని నిర్ణయించుకున్నట్లు స్వయంగా ప్రధాన మంత్రి చెప్పారు.
దీక్ష చేపట్టిన నాటి నుంచి ప్రధానమంత్రి వివిధ ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాలను సందర్శించారు.
వాటిలో నాసిక్‌లోని రామ్‌కుండ్, శ్రీ కాలరామ దేవాలయం, లేపాక్షిలోని వీరభద్ర ఆలయం, కేరళలోని త్రిప్రయార్ శ్రీ రామస్వామి దేవాలయం ఉన్నాయి.