Loading...
PM Modi: రాఖీ వేళ చిన్నారులతో మోదీ సందడి.. సరదాగా ముచ్చటించిన ప్రధాని
రాఖీ వేళ చిన్నారులతో మోదీ సందడి.. సరదాగా ముచ్చటించిన ప్రధాని

PM Modi: రాఖీ వేళ చిన్నారులతో మోదీ సందడి.. సరదాగా ముచ్చటించిన ప్రధాని

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2026
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాఖీ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కూల్‌ విద్యార్థులతో కాసేపు సరదాగా గడిపారు. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసం 7, లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో రక్షాబంధన్‌ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో మోదీ ఆప్యాయంగా మాట్లాడారు. చిన్న‌త‌నంలో మీరెటువంటి క‌ల‌ క‌న్నార‌ని పిల్ల‌లు ప్ర‌ధాని మోదీని అడిగారు దీనికి ప్రధాని నవ్వుతూ సరదాగా సమాధానమిచ్చారు. ''మీ అందరినీ కలవాలనుకున్నాను'' అని ఆయన చమత్కరించారు.

వివరాలు 

విద్యార్థులకు ప్రధాని షేక్‌హ్యాండ్

చిన్నారులతో మోదీ సంభాషిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రధాని షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. అంతేకాదు.. యువత మాదిరిగా హై-ఫైవ్‌ చేస్తూ వారిని ఉత్సాహపరిచారు.

చిన్నారులను ఆశీర్వదిస్తూ వారితో ఆప్యాయంగా గడిపారు.

ఈ వీడియో రీల్‌ను ప్రధాని మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలోనూ పంచుకున్నారు.

రక్షాబంధన్‌ సందర్భంగా చిన్నారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రేమ, ఆప్యాయత, నమ్మకానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

రక్షాబంధన్‌ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, సౌభాగ్యం, విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నట్లు మోదీ తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాఖీ వేళ చిన్నారులతో మోదీ సందడి

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాఖీ వేళ చిన్నారులతో మోదీ సందడి

ADVERTISEMENT