LOADING...
PM Modi: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌‌కు మోదీ ఫోన్.. తాజా పరిణామాలపై చర్చ
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌‌కు మోదీ ఫోన్.. తాజా పరిణామాలపై చర్చ

PM Modi: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌‌కు మోదీ ఫోన్.. తాజా పరిణామాలపై చర్చ

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 13, 2026
08:12 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, జరుగుతున్న ప్రాణనష్టం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత, ఇంధన సరఫరా పరిస్థితులపై కూడా మోదీ ప్రత్యేకంగా చర్చించారు. ఫోన్ సంభాషణ అనంతరం మోదీ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ 

వివరాలు 

కేవలం రూ.300కే రైతులకు యూరియా  

పశ్చిమాసియాలో ఏర్పడిన తీవ్రమైన పరిస్థితుల గురించి చర్చించేందుకు ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియన్‌తో మాట్లాడినట్లు తెలిపారు. ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న పరిస్థితి, పౌరుల ప్రాణనష్టం, పౌర మౌలిక సదుపాయాలకు కలుగుతున్న నష్టం పట్ల తన తీవ్ర ఆందోళనను ఆయన వ్యక్తం చేసినట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతర్జాతీయ సంక్షోభాల కారణంగా ఏర్పడే ఆర్థిక ఒత్తిడులను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో కూడా మోదీ వివరించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత్ అనుసరించిన విధానాన్ని ఆయన గుర్తు చేశారు. యుద్ధ ప్రభావం భారత ప్రజలపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ చర్యలు తీసుకుందని చెప్పారు. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు భారీగా పెరిగినప్పటికీ, రైతులకు యూరియా సంచిని కేవలం రూ.300కే అందించామని తెలిపారు.

Advertisement

వివరాలు 

గత నెల 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి 

అయితే అదే యూరియా అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.3,000 వరకు ఖర్చవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కూడా అవసరమని మోదీ సూచించారు. మార్కెట్‌లో కలిగే తారుమార్లు, తప్పుడు సమాచారం వంటి అంశాలపై అధికారులు కఠినంగా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేసిన ఘటన ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు సమాచారం. దీనికి ప్రతీకారంగా ఇరాన్ చర్యలకు దిగింది. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్న అమెరికా అనుబంధ గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ దాడులు చేపట్టింది.

Advertisement

వివరాలు 

28 భారత నౌకలు భారత్ వైపు

అదేవిధంగా వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేసింది. ఈ పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. అయితే ఈ పరిస్థితుల్లో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ నాయకులతో దౌత్యపరమైన చర్చలు జరిపారు. ఆ చర్చల ఫలితంగా హార్ముజ్ జలసంధి ద్వారా భారత నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు ఇరాన్ అంగీకరించింది. ప్రస్తుతం 28 భారత నౌకలు భారత్ వైపు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

Advertisement