LOADING...
Modi-Trump: ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ
ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

Modi-Trump: ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2025
07:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలపై ఇద్దరూ విస్తృతంగా చర్చించుకున్నారు. అంతేకాక, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కీలక పరిణామాలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ముగించి వెళ్లిన వెంటనే మోదీ, ట్రంప్‌తో ఫోన్ ద్వారా మాట్లాడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్‌కు చేసిన ఇది మొదటి పర్యటన. ఢిల్లీకి చేరుకున్న వెంటనే ఆయనకు రెడ్ కార్పెట్ అథిథి స్వాగతం లభించింది. మోదీ స్వయంగా ముందుకు వెళ్లి పుతిన్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.

వివరాలు 

 టయోటా ఫార్చ్యూనర్‌లో మోదీ, పుతిన్  

ఇద్దరూ తమ అధికారిక కాన్వాయ్‌లను పక్కనపెట్టి, టయోటా ఫార్చ్యూనర్‌లో కలిసి ప్రధాని నివాసం చేరుకోవడం ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా రష్యా నుంచి భారత్ భారీగా ముడి చమురు దిగుమతి చేసుకోవడంతో, దీనిపై అమెరికా పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తున్న సమయంలో జరిగిన ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ  చేసిన ట్వీట్ 

Advertisement