LOADING...
PM Modi: 'ప్రపంచ ఆశల వెలుగులు నింపాలి'.. ట్రంప్ ఫోన్‌ కాల్‌.. ప్రధాని మోదీ ధన్యవాదాలు 
'ప్రపంచ ఆశల వెలుగులు నింపాలి'..ట్రంప్ ఫోన్‌ కాల్‌..ప్రధాని మోదీ ధన్యవాదాలు

PM Modi: 'ప్రపంచ ఆశల వెలుగులు నింపాలి'.. ట్రంప్ ఫోన్‌ కాల్‌.. ప్రధాని మోదీ ధన్యవాదాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 22, 2025
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

దీపావళి సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో తనకు టెలిఫోన్‌ సంభాషణ జరిగినట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ పంపిన దీపావళి శుభాకాంక్షలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని మోదీ ఎక్స్‌ లో పోస్ట్‌ చేశారు. "అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌ ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలిపినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పర్వదినం మన రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచానికి ఆశ, శాంతి, వెలుగుల ప్రతీకలుగా నిలవాలని కోరుకుంటున్నాను. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే క్రమంలో మనం ఐక్యంగా ముందుకు సాగాలి," అని మోదీ రాసుకొచ్చారు. ఈ సందేశంతో పాటు మోదీ, ట్రంప్‌ను ట్యాగ్‌ చేస్తూ తన కృతజ్ఞతను వ్యక్తం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ చేసిన ట్వీట్