PM Modi: డిసెంబర్ 15 నుంచి మూడు దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15 నుంచి 18 వరకు జోర్డాన్, ఈథియోపియా,ఒమన్‌కు కీలకమైన మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. పశ్చిమ ఆసియా,ఆఫ్రికాలోని ముఖ్య మిత్ర దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలపర్చడం ఈ సందర్శన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. డిసెంబర్ 15-16 తేదీల్లో జోర్డాన్‌తో పర్యటన ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 16, 17 తేదీల్లో ఈథియోపియా సందర్శన, చివరగా డిసెంబర్ 17-18 తేదీల్లో ఒమన్ పర్యటన ఉంటుందని ఇండియా టుడే సమాచారం. దక్షిణాఫ్రికాలోని జోహనెస్‌బర్గ్‌లో జరిగిన G20 సమ్మిట్‌లో పాల్గొన్న తర్వాత వస్తున్న ఈ అంతర్జాతీయ పర్యటన, గ్లోబల్ సౌత్ లక్ష్యాలు, సమగ్ర అభివృద్ధిని భారత్ ఎలా ముందుకు తెస్తుందనే విషయాన్ని మరోసారి ప్రపంచానికి గుర్తు చేయనుంది.
వివరాలు
ఒమన్‌లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
ముఖ్యంగా గాజా యుద్ధ విరమణ, ప్రాంతీయ స్థిరత్వం, వాణిజ్య అవకాశాలు ప్రధాన చర్చా అంశాలుగా ఉండనున్నాయి. జోర్డాన్‌లో పెద్దగా చమురు సంపద లేకపోయినా, భారత వ్యాపారం, పెట్టుబడులకు అది కీలక భాగస్వామిగా ఎదిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్స్టైల్స్, ఔషధ రంగాల్లో సహకారం పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఒమన్ పర్యటనలో సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం ప్రధాన ప్రాధాన్యంగా నిలువనుంది. భారత్-ఒమన్ దౌత్య సంబంధాలకు ఇది 70 ఏళ్ల ప్రాశస్త్యమైన సంవత్సరం కావడంతో, రెండు దేశాల మధ్య బంధం ఎంత బలంగా ఉందో ఈ సందర్శన మరింత స్పష్టతనిస్తుంది. ప్రధానమంత్రి మోదీకి ఇది రెండో ఒమన్ పర్యటన. జోర్డాన్‌కు అయితే ఆయన 2018లో ఒకసారి మాత్రమే వెళ్లారు.
వివరాలు
ఆఫ్రికాలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఈథియోపియా ఒకటి
అప్పట్లో రమల్లాకు వెళ్తూ జోర్డాన్ మీదుగా ప్రయాణించారు. భారత్-ఒమాన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి చర్చలు పూర్తైన, అధికారిక సంతకం ఇంకా జరగలేదు. అధికారుల ప్రకారం, ఈ పర్యటనతో CEPA (Comprehensive Economic Partnership Agreement) అమలుకు దారితీసే అవకాశం ఉంది. దీని ద్వారా ఇరు దేశాలకు మార్కెట్ యాక్సెస్ పెరగడం,పెట్టుబడులు వృద్ధి చెందడం, ఎనర్జీ, వాణిజ్యం, సముద్ర భద్రత రంగాల్లో మరింత దగ్గరి సహకారం ఏర్పడే అవకాశం ఉంది. ఈథియోపియాతో సంబంధాలను బలోపేతం చేయడమూ ఈ పర్యటనలో కీలక లక్ష్యం. ఆఫ్రికా ఖండం భారత్‌కు దీర్ఘకాల విదేశాంగ వ్యూహంలో ఎంతో కీలకం. ఆఫ్రికాలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన ఈథియోపియాతో వాణిజ్యం, రక్షణ, అభివృద్ధి రంగాల్లో కొత్త సహకారాలు ఎదురు చూడవచ్చు.
వివరాలు
పీఎం మోదీ భూటాన్‌కు.. రెండు రోజుల పర్యటన
ఇదిలా ఉండగా, ఇటీవలే పీఎం మోదీ భూటాన్‌కు కూడా రెండు రోజుల పర్యటన చేశారు. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం తర్వాత ఇది ఆయన తొలి అధికారిక భూటాన్ పర్యటన. అక్కడ భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యెల్ వాంగ్‌చుక్‌లతో సమావేశమయ్యారు. భూటాన్‌తో ఉన్న సంబంధాలు "పరస్పర నమ్మకం, అర్థం చేసుకోవడం, స్నేహపూర్వకత మీద నిలిచిన ప్రత్యేకమైన బంధం" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.