LOADING...
PM Modi: అసోం కజిరంగా నేషనల్ పార్క్‌లో ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ 
PM Modi కజిరంగా నేషనల్ పార్క్‌లో ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ

PM Modi: అసోం కజిరంగా నేషనల్ పార్క్‌లో ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ 

వ్రాసిన వారు Stalin
Mar 09, 2024
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అసోం చేరుకున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున కజిరంగా నేషనల్ పార్క్‌కు చేరుకున్న ప్రధాని మోదీ ఇక్కడ ఏనుగు (Elephant Safari)పై ప్రయాణించారు. కజిరంగా పార్క్‌(Kaziranga National Park) సెంట్రల్ కోహోరా రేంజ్ సమీపంలోని పోలీసు అతిథి గృహంలో ప్రధాని శుక్రవారం రాత్రి బస చేశారు. శనివారం తెల్లవారుజామున పార్కుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఏనుగు, జీపు రెండింటిలోనూ ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. కొంతసేపు ఏనుగుపై స్వారీ చేసిన తర్వాత ప్రధాని జీపుపై అడవిలోకి వెళ్లారు. దాదాపు రెండు గంటల పాటు ప్రధాని ఇక్కడే ఉన్నారు. ప్రధాని మోదీ ఏనుగు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నరేంద్ర మోదీ

తొలిసారి ప్రధాని మోదీ సందర్శన

ఖడ్గమృగాలకు అతిపెద్ద నివాస స్థలంగా కజిరంగా నేషనల్ పార్క్‌ ప్రసిద్ధి చెందింది. ఈ ఉద్యానవనం 600రకాల పక్షులకు నిలయం. ఈ పార్క్‌ను 1985లో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్(యునెస్కో) వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా ప్రకటించింది. ప్రధాని మోదీ కజిరంగా నేషనల్ పార్క్‌‌ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కజిరంగా నేషనల్ పార్క్ భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన హాలిడే గమ్యస్థానా ఒకటి. 2200 కంటే ఎక్కువ భారతీయ ఒక-కొమ్ము ఖడ్గమృగాలు ఉన్నాయి. ప్రపంచంలోని ఖడ్గమృగాల్లో 2/3 వంతు ఈ పార్కులో ఉన్నాయి. ఇది తూర్పు హిమాలయన్ బయోడైవర్సిటీ హాట్‌స్పాట్ - గోలాఘాట్, నాగావ్ జిల్లా అంచులలో ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కజిరంగా నేషనల్ పార్క్‌లో మోదీ

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాని మోదీ ట్వీట్