LOADING...
Seva Teerth: జనవరి నెలాఖరుకి కొత్త కార్యాలయానికి ప్రధాని మోదీ 
'సేవా తీర్థ్' సిద్ధం… త్వరలో కొత్త కార్యాలయానికి ప్రధాని మోదీ

Seva Teerth: జనవరి నెలాఖరుకి కొత్త కార్యాలయానికి ప్రధాని మోదీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 12, 2026
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

రైసినా హిల్ సమీపంలో ప్రధాని నరేంద్ర మోదీ కోసం నిర్మిస్తున్న కొత్త కార్యాలయం దాదాపు పూర్తయింది. ప్రస్తుతం చిన్న చిన్న జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోనే ప్రధాని కొత్త కార్యాలయం నుంచి పనులు ప్రారంభించే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా రైసినా హిల్ దగ్గర ఈ కార్యాలయాన్ని నిర్మించారు. నిర్మాణ దశలో దీనిని ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్గా పిలిచారు. అయితే ఇప్పుడు దీనికి 'సేవా తీర్థ్' అనే పేరు పెట్టారు. ఈ ప్రాంగణంలో మూడు భవనాలు ఉన్నాయి.సేవా తీర్థ్-1లో ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఉండగా,సేవా తీర్థ్-2లో కేబినెట్ సెక్రటేరియట్, సేవా తీర్థ్-3లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కార్యాలయం ఏర్పాటు చేశారు.

వివరాలు 

 ప్రధానమంత్రి కార్యాలయానికి ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్ పేరు 

సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కింద ఇప్పటికే కొత్త పార్లమెంట్ భవనం, ఉపరాష్ట్రపతి ఎన్‌క్లేవ్ సిద్ధమయ్యాయి. ప్రధానమంత్రి కార్యాలయ నిర్మాణం కూడా దాదాపు పూర్తయ్యింది. అలాగే కొత్తగా నిర్మిస్తున్న ఎనిమిది మంత్రిత్వ శాఖల కార్యాలయాల్లో మూడింటి పనులు పూర్తై, అవి ఇప్పటికే పనిచేస్తున్నాయి. మొదట ప్రధానమంత్రి కార్యాలయానికి ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్ అనే పేరు పెట్టాలని భావించారు. అయితే తర్వాత ప్రభుత్వం దీనికి సేవా తీర్థ్ అని నామకరణం చేసింది. ప్రధాని నివాసం కూడా ఈ కొత్త కార్యాలయానికి సమీపంలోనే నిర్మిస్తున్నారు. అది సిద్ధమైన తర్వాత ప్రస్తుతం నివసిస్తున్న 7, లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసాన్ని ప్రధాని ఖాళీ చేయనున్నట్లు సమాచారం.

వివరాలు 

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా డిజైన్

సేవా తీర్థ్‌లో విదేశీ ప్రతినిధులు, ప్రముఖులను కలిసేందుకు అత్యాధునిక సదుపాయాలతో ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. సాంకేతికంగా అత్యున్నతంగా ఉండటంతో పాటు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వీటిని డిజైన్ చేశారు. కేబినెట్ సమావేశాల కోసం ప్రత్యేకంగా కొత్త హాల్‌ను కూడా నిర్మించారు. ఇక ప్రధానమంత్రి కార్యాలయంలో ఓపెన్ ఫ్లోర్ విధానం అమలు చేయగా, ఇది పని సంస్కృతిలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందించారని అధికారులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

కర్తవ్య భవన్'కు హోం,ఆర్థిక మంత్రిత్వ శాఖలు

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రి కార్యాలయం దక్షిణ బ్లాక్‌లోనే ఉండేది. అక్కడే విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖలు కూడా పనిచేసేవి. ఉత్తర బ్లాక్‌లో హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఉండేవి. ఇప్పుడు ఆ మంత్రిత్వ శాఖలను కర్తవ్య భవన్ కు తరలించారు. వలస పాలన కాలానికి చెందిన ఉత్తర, దక్షిణ బ్లాక్‌లను ఇకపై భారతదేశానికి చెందిన 5 వేల ఏళ్ల నాగరికతను చూపించే భారీ మ్యూజియంగా మార్చనున్నారు. ఈ మ్యూజియం తొలి దశను వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement