NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌‌కు 'సంవిధాన్‌ సదన్‌' పేరు.. ప్రధాని మోదీ ప్రతిపాదన 
    పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌‌కు 'సంవిధాన్‌ సదన్‌' పేరు.. ప్రధాని మోదీ ప్రతిపాదన 
    1/3
    భారతదేశం 1 నిమి చదవండి

    పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌‌కు 'సంవిధాన్‌ సదన్‌' పేరు.. ప్రధాని మోదీ ప్రతిపాదన 

    వ్రాసిన వారు Naveen Stalin
    September 19, 2023 | 02:08 pm
    September 19, 2023 | 02:08 pm
    పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌‌కు 'సంవిధాన్‌ సదన్‌' పేరు.. ప్రధాని మోదీ ప్రతిపాదన 
    పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌‌కు 'సంవిధాన్‌ సదన్‌' పేరు.. ప్రధాని మోదీ ప్రతిపాదన

    పార్లమెంట్ పాత భవనంలోని సెంట్రల్ హాల్‌లో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. పార్లమెంట్ కొత్త భవనంలోకి లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలను ప్రారంభడానికి ముందు ఆయన మాట్లాడారు. 1947లో బ్రిటీష్ వారు సెంట్రల్ హాల్‌లోనే అధికార మార్పిడి చేశారని మోదీ అన్నారు. ఆ చారిత్రాత్మక ఘట్టానికి ఈ సెంట్రల్ హాల్ సాక్షిగా నిలిచిందన్నారు. పాత భవనం గౌరవాన్ని కాపాడేందుకు పాత పార్లమెంట్‌ హౌస్‌ సెంట్రల్‌ హాల్‌కు 'సంవిధాన్‌ సదన్‌(రాజ్యాంగ సభ)'గా నామకరణం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. రాజ్యాంగ సభను చూసినప్పుడల్లా ఇక్కడ కూర్చున్న మహానుభావుల జ్ఞాపకాలను గుర్తు చేస్తుందన్నారు. తద్వారా అది మన జీవితాలకు స్ఫూర్తిగా మిగిలిపోతుందన్నారు. ఇది భవిష్యత్ తరానికి బహుమతి అవుతుందన్నారు.

    2/3

    పార్లమెంట్ గౌరవం ఎప్పటికీ తగ్గకూడదు: మోదీ

    నేడు గణేష్ చతుర్థి రోజున కొత్త ఇంటి(కొత్త పార్లమెంట్ భవనం)కి వెళ్తున్నామని, దాని గౌరవం ఎప్పటికీ తగ్గకూడదని మోదీ సూచించారు. అమృత్ కాల్‌లో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగాలన్న లక్ష్యంతో కొత్త పార్లమెంటు భవనానికి వెళ్తున్నామన్నారు. ఇప్పటి వరకు లోక్‌సభ, రాజ్యసభలు 4,000 చట్టాలను ఆమోదించాయి. అవసరమైనప్పుడు, బిల్లులను ఆమోదించడానికి వ్యూహాలను రూపొందించడానికి ఈ సెంట్రల్ హాల్‌లోనే ఉమ్మడి సమావేశాలు జరిగాయన్నారు. ట్రిపుల్ తలాక్ చట్టంపై మోదీ మాట్లాడుతూ.. ఈ పార్లమెంట్ వల్ల ముస్లిం తల్లులు, సోదరీమణులకు న్యాయం జరిగిందన్నారు. ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకించే చట్టం ఇక్కడి నుంచే ఆమోదం పొందిందని అన్నారు. ట్రాన్స్‌జెండర్లకు న్యాయం చేసే చట్టాలను కూడా పార్లమెంట్ ఆమోదించిందన్నారు.

    3/3

    పార్లమెంట్ కొత్త భవనంలో ఎంపీలకు బహుమతులు

    భవిష్యత్తు కోసం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని మోదీ అన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించడం వరకే పరిమితం కాలేమన్నారు. చంద్రయాన్-3 విజయం తర్వాత, భారత యువత సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం నుండి ప్రేరణ పొందిందన్నారు. ఈ అవకాశాన్ని మనం వదులుకోవలసిన అవసరం లేదన్నారు. తన ప్రసంగం ముగిసిన వెంటనే, ప్రధాని మోదీ, ఎంపీలందరూ పాత భవనం నుంచి కొత్త భవనంలోకి వెళ్లారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం రోజున ఎంపీలందరికీ రాజ్యాంగం కాపీ, పార్లమెంట్‌కు సంబంధించిన పుస్తకాలు, స్మారక నాణెం, స్టాంపుతో కూడిన బహుమతి బ్యాగ్‌ని అందజేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంట్ కొత్త భవనం
    పార్లమెంట్
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి

    తాజా

    పార్లమెంట్ కొత్త భవనం

    చారిత్రక సందర్భం.. అధికారికంగా భారత పార్లమెంట్‌గా మారిన కొత్త భవనం  నరేంద్ర మోదీ
    కొత్త పార్లమెంట్‌లో టెక్నాలజీ మూములుగా ఉండదు.. సమయం దాటితే మైక్‌ కట్‌ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023

    పార్లమెంట్

    Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం  నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    ఫాక్స్‌కాన్ సంచలన ప్రకటన.. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి అపూర్వ బహుమతి తైవాన్
    నేడు సాయంత్రం 6:30 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్  ప్రధాన మంత్రి
    ఆ మూడు రాష్ట్రాల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు: లోక్‌సభలో ప్రధాని మోదీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    మరోసారి తెలంగాణ గడ్డ మీదకు మోదీ.. బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ బీజేపీ

    ప్రధాన మంత్రి

    PM Modi: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటాం: మోదీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..లబ్ధిదారులకు 2 లక్షల రుణం మంజూరు దిల్లీ
    రేపు యశోభూమిని ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. పుట్టిన రోజు సందర్భంగా కేంద్రం ఏర్పాట్లు నరేంద్ర మోదీ
    దిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ పూజలు  రిషి సునక్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023