LOADING...
Polavaram: పోలవరానికి మరో రూ.1,301 కోట్లు.. అడ్వాన్స్‌ నిధుల కింద కేంద్రం విడుదల
పోలవరానికి మరో రూ.1,301 కోట్లు.. అడ్వాన్స్‌ నిధుల కింద కేంద్రం విడుదల

Polavaram: పోలవరానికి మరో రూ.1,301 కోట్లు.. అడ్వాన్స్‌ నిధుల కింద కేంద్రం విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2026
09:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీగా నిధులు విడుదల చేసింది. తాజాగా రూ.1,301 కోట్ల అడ్వాన్స్‌ నిధులు మంజూరు చేయడంతో, ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం విడుదలైన నిధులు రూ.2,809 కోట్లకు చేరాయి. ఇప్పటికే రూ.1,508 కోట్లు విడుదల కాగా,తాజా కేటాయింపుతో రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన బడ్జెట్ అంచనాలకు దగ్గరగా నిధులు సమీకరించినట్లైంది. గతంలో విడుదలైన రూ.1,508 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పనులకు ప్రాధాన్యత ఇచ్చింది. అందులో రూ.600 కోట్లు పోలవరం నిర్మాణ పనులకు ఖర్చు చేయగా,మరో రూ.300 కోట్లు పునరావాసం (R&R),భూసేకరణ కార్యక్రమాలకు వినియోగించింది. అయితే, ఈ ఖర్చులలో భాగంగా చేసిన రూ.300కోట్లను కేంద్రం ఇప్పటివరకు రీయింబర్స్ చేయలేదు.

వివరాలు 

పోలవరం నిధుల విడుదల విధానంలో కీలక మార్పు

కేంద్ర నిబంధనల ప్రకారం,అడ్వాన్స్‌గా ఇచ్చిన నిధుల్లో కనీసం 75 శాతం ఖర్చు చేసిన తర్వాతే తదుపరి నిధులు విడుదల చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాల మేరకు పనులు పూర్తి చేసినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాలు చూపుతూ కేంద్రం ఆ రూ.300 కోట్లను నిలిపివేసింది. ఈ అంశాన్ని ఇటీవల కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి కాంతారావు పోలవరం ప్రాజెక్టు సందర్శన సమయంలో రాష్ట్ర అధికారులు ప్రస్తావించారు. ప్రాజెక్టు పురోగతిని ప్రత్యక్షంగా చూపించి, పెండింగ్ సమస్యను వివరించారు. దీనిపై స్పందించిన కార్యదర్శి దిల్లీకి వెళ్లిన తర్వాత సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుని, పెండింగ్ క్లియర్ చేశారు. ఇక పోలవరం నిధుల విడుదల విధానంలో కీలక మార్పు చోటుచేసుకుంది.

వివరాలు 

పనిచేసిన వెంటనే బిల్లు సమర్పిస్తే, వెంటనే నిధులు జారీ

ఇప్పటివరకు కేంద్రం విడుదల చేసిన నిధులు రాష్ట్ర ఖజానాకు చేరి,అక్కడి నుంచి సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాకు బదిలీ అయ్యేవి. ఆతర్వాత ప్రాజెక్టు పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించేవారు.కానీ ఇకపై ఈ విధానం మారనుంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సింగిల్ నోడల్ ఖాతాకు కేంద్రం నిధులు పంపడం ఇదే చివరిసారి. ఇక నుంచి 'స్పర్శ్'విధానం అమల్లోకి రానుంది.ఈ కొత్త విధానంలో,కేంద్రమే నేరుగా ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లుల ఆధారంగా నిధులను విడుదల చేస్తుంది. పనిచేసిన వెంటనే బిల్లు సమర్పిస్తే, వెంటనే నిధులు జారీ అవుతాయి. ఈమార్పుతో నిధుల విడుదల ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు కూడా మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Advertisement