LOADING...
Rahul Mamkootathil: ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కుటత్తిల్‌పై అత్యాచార కేసు.. అరెస్ట్‌ చేసిన పోలీసులు
ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కుటత్తిల్‌పై అత్యాచార కేసు.. అరెస్ట్‌ చేసిన పోలీసులు

Rahul Mamkootathil: ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కుటత్తిల్‌పై అత్యాచార కేసు.. అరెస్ట్‌ చేసిన పోలీసులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2026
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కుటత్తిల్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాలక్కాడ్‌లోని ఒక హోటల్ నుంచి అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఇటీవల ఒక యువతి అతడిపై అత్యాచార ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టబడింది. పోలీసుల సమాచారం ప్రకారం, రాహుల్ మామ్‌కుటత్తిల్‌పై గతంలో కూడా లైంగిక వేధింపుల ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే. ఓ నటి, మరో యువతి అతడిపై లైంగికంగా వేధిస్తున్నట్టు ఫిర్యాదు చేసిన తరువాత కొన్ని అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల్లో ముందస్తు బెయిల్ పొందారు.

Details

గర్భాన్ని తొలగించుకోవాలని బెదిరింపులు

తాజాగా మరో యువతిపై రాహుల్‌అత్యాచారానికి పాల్పడ్డాడని, గర్భాన్ని తొలగించుకోవాలని బెదిరించాడని ఫిర్యాదు చేసింది. తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మానసిక, శారీరకంగా వేధింపులకు గురిచేసినట్టు ఆరోపించింది. రాజకీయ వ్యక్తిగా రాహుల్ మామ్‌కుటత్తిల్‌కు ప్రభావం ఉండటంతో, ఫిర్యాదు చేసేందుకు ఇంతకాలం వెనకడుగు వేసినట్లు తెలిపింది. పరారీలో ఉన్న ఎమ్మెల్యేను పాలక్కాడ్‌లో ఇటీవల అరెస్ట్‌ చేశారు. వరుస లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాహుల్ మామ్‌కుటత్తిల్‌ను బహిష్కరించింది.

Advertisement