తదుపరి వార్తా కథనం

Police suicide: హైదరాబాద్ పాతబస్తీలో పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య
వ్రాసిన వారు
Stalin
Apr 07, 2024
02:52 pm
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ లోని పాతబస్తీ లో హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కబూతర్ ఖానా, పోలీసు పికెట్ వద్ద కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
టీఎస్ ఎస్పీ 10వ బెటాలియన్ కు చెందిన బాలేశ్వర్ ఆదివారం సర్వీసు రివాల్వర్ తీసుకుని కాల్చుకున్నాడు.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బాలేశ్వర్ కొన్నేళ్లుగా హైదరాబాద్ లో పోలీసు కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
బాలేశ్వర్ ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న దక్షిణ మండల డీసీపీ సాయి చైతన్య ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.
బాలేశ్వర్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బాలేశ్వర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.