Page Loader
Akbaruddin Owaisi: 'నేను కను సైగ చేస్తే..' పోలీసులకు అక్బరుద్దీన్ ఒవైసీ వార్నింగ్ 
Akbaruddin Owaisi: 'నేను కను సైగ చేస్తే..' పోలీసులకు అక్బరుద్దీన్ ఒవైసీ వార్నింగ్

Akbaruddin Owaisi: 'నేను కను సైగ చేస్తే..' పోలీసులకు అక్బరుద్దీన్ ఒవైసీ వార్నింగ్ 

వ్రాసిన వారు Stalin
Nov 22, 2023
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అక్బరుద్దీన్ ఒవైసీ ప్రచార కార్యక్రమంలో పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను బహిరంగంగా బెదిరించిన ఘటన సంచలనంగా మారింది. ఎన్నికల నియమావళిని పాటించి తన ప్రసంగాన్ని ముగించాలని అక్బరుద్దీన్ ఒవైసీకి ఇన్‌స్పెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఆ ఇన్‌స్పెక్టర్‌ను అక్బరుద్దీన్ బెదిరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మంగళవారం రాత్రి 10గంటల సమయంలో పాతబస్తీలో అక్బరుద్దీన్ ప్రచారం కార్యక్రమంలో మాట్లాడుతుండగా.. వీలైనంత త్వరగా ప్రసంగాన్ని ముగించాలని ఆ ఏరియా ఇన్‌స్పెక్టర్ సూచించారు. దీంతో అక్బరుద్దీన్ అగ్గిలం మీద గుగ్గిలం అయ్యారు. తన ప్రసంగాన్నే ఆపుతావా? అంటూ.. పోలీసులపైకి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒవైసీ

నా అనురుచరులు పరుగెత్తిస్తారు: ఒవైసీ

ఈ సందర్భంగా అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తనకు ప్రసంగించడానికి ఇంకా 5 నిమిషాల సమయం ఉందని, ఆ సమయం అయ్యే వరకు తనను ఎవరూ ఆపలేరని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. అలాగే కత్తిపోట్లు, బుల్లెట్ గాయాలతో తాను బలహీనపడ్డానని అనుకుంటున్నారా? అని పోలీసులను అక్బరుద్దీన్ ప్రశ్నించారు. తనను ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఇక్కడి నుంచి పరిగెత్తిస్తానని హెచ్చరించారు. తన అనుచరులకు ఒక్క సైగ చేస్తే.. ఇక్కడి నుంచి పోలీసులను పరిగెత్తిస్తారని వెల్లడించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. అక్బరుద్దీన్‌పై బుల్డోజర్ చర్య తప్పదని హెచ్చరించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న అక్బరుద్దీన్ వీడియో