New year Rules: పోలీసుల కొత్త రూల్స్.. మందుతాగి దొరికితే 6నెలలు జైలు
కొత్త సంవత్సరం వేళ.. తెలంగాణ పోలీసులు మందుబాబులపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఈ మేరకు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. న్యూ ఇయర్ నేపథ్యంలో ఆదివారం రాత్రి 8గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేయనున్నారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మందు తాగి వాహనాలు నడిపితే 10వేలు ఫైన్, 6 నెలలు జైలు శిక్ష పడుతుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను ఇప్పటికే డీజీపీ కార్యాలయం ఆదేశాలు జారీ అయ్యాయి. అర్థరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత కూడా కొత్త సంవత్సరం వేడుకలు కొనసాగిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
వేడుకలకు అనుమతి తీసుకోవాలి: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్
ఆంధ్రప్రదేశ్‌లో కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. న్యూ ఇయర్ వేడుకల కోసం కార్యక్రమాలు నిర్వహించే వారికి పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. వేడుకలు నిర్వహించే వారు కచ్చితంగా పోలీసులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. వేడుకలు జరిగే చోట.. లోపలికి వెళ్లే మార్గమే కాకుండా, బయటకు వచ్చే మార్గాలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పార్కింగ్ ప్రాంతాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. బాణసంచా కాల్చడం పరిమితికి మించొద్దన్నారు. సామర్ధ్యానికి మించి పాసులను జారీ చేయొద్దని హెచ్చరించారు. రాత్రి 10 గంటల నుంచి రాష్ట్రంలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేపడతామని పోలీసులు వెల్లడించారు.