Loading...
Mohandas: నీట్ విద్యార్థినులపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. రైట్‌వింగ్ విశ్లేషకుడు అరెస్ట్
నీట్ విద్యార్థినులపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. రైట్‌వింగ్ విశ్లేషకుడు అరెస్ట్

Mohandas: నీట్ విద్యార్థినులపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. రైట్‌వింగ్ విశ్లేషకుడు అరెస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2026
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు, ముఖ్యంగా మహిళా విద్యార్థులపై అభ్యంతరకరమైన, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేసిన రైట్‌వింగ్ విశ్లేషకుడు టి.జి. మోహన్‌దాస్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కొచ్చిలోని ఆయన ఇంటి వద్ద ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సోమవారం ఉదయం అరెస్ట్ ప్రక్రియను అధికారికంగా నమోదు చేశారు. ఈ పరిణామం కేరళలో రాజకీయంగానూ తీవ్ర చర్చకు దారితీసింది. మోహన్‌దాస్ నిర్వహిస్తున్న 'పత్రిక' యూట్యూబ్ ఛానల్‌లో ఇటీవల పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు తెలిపారు. జంతర్ మంతర్ పరిసరాల్లో నిరసనలను అణచివేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు.

వివరాలు 

మహిళా విద్యార్థులపై కూడా మోహన్‌దాస్ తీవ్రంగా అభ్యంతరకర వ్యాఖ్యలు

అక్కడ కర్ఫ్యూ విధించి, హెచ్చరికలు ఇచ్చిన తర్వాత కాల్పులకు ఆదేశించేవాడినని అన్నారు.

ఈ క్రమంలో కొంతమంది మరణించినా, వికలాంగులైనా పట్టించుకోనని, నాలుగు గంటల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావచ్చని వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా ఆందోళనలో పాల్గొంటున్న మహిళా విద్యార్థులపై కూడా మోహన్‌దాస్ తీవ్రంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి నిరసనల్లో పాల్గొనే యువతులు అత్యాచారానికి గురైనా ఫిర్యాదు చేయరని, వారు అత్యాచారాన్ని ఆస్వాదిస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి.

మహిళలను అవమానించేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

వివరాలు 

వీడియోను రూపొందించేందుకు ఉపయోగించిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం

ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తిరువనంతపురం సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టడం, ప్రజల్లో కల్లోలం సృష్టించేలా వ్యవహరించడం, మహిళల గౌరవానికి భంగం కలిగించడం వంటి ఆరోపణలతో కేసు నమోదు చేశారు.

భారతీయ నగరక్షా సంహిత (బీఎన్‌ఎస్), సమాచార సాంకేతిక చట్టంలోని పలు సెక్షన్లను కేసులో వర్తింపజేశారు.

దర్యాప్తులో భాగంగా మోహన్‌దాస్ నివాసం నుంచి వీడియోను రూపొందించేందుకు ఉపయోగించిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వాటిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. వీడియోలోని వ్యాఖ్యలు, వాటి ప్రచారం, ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

ఖండించిన ఆర్‌ఎస్‌ఎస్

మోహన్‌దాస్ గతంలో బీజేపీ మేధోవిభాగం కన్వీనర్‌గా పనిచేసిన విషయం కూడా ఈ వ్యవహారానికి రాజకీయ ప్రాధాన్యం తీసుకొచ్చింది.

అయితే ఆయన చేసిన వ్యాఖ్యలతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఆర్‌ఎస్‌ఎస్ స్పష్టం చేసింది.

అవి పూర్తిగా మోహన్‌దాస్ వ్యక్తిగత అభిప్రాయాలని పేర్కొంటూ, వాటిని తీవ్రంగా ఖండించింది.

మరోవైపు ఇలాంటి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి.గోవిందన్ డిమాండ్ చేశారు.

వివాదానికి కారణమైన వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.

దీంతో మోహన్‌దాస్ వ్యాఖ్యలు, ఆయన అరెస్ట్‌పై కేరళలో రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

ADVERTISEMENT