టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ: 14మందితో ఏర్పాటు
తెలుగుదేశం పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో మొత్తం 14మంది సభ్యులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించారు. టీడీపీ రాజకీయ కార్యక్రమాలను చూసుకునేందుకు పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించామని అచ్చెన్నాయుడు తెలియజేశారు. పొలిటికల్ యాక్షన్ కమిటీ సభ్యులు: యనమల రామకృష్ణుడు నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ కింజరపు అచ్చెన్నాయుడు ఎం.ఏ షరీఫ్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పయ్యావుల కేశవ్ బీసీ జనార్దన్ రెడ్డి బీద రవిచంద్ర యాదవ్ కొల్లు రవీంద్ర నిమ్మల రామానాయుడు కాలువ శ్రీనివాసులు నక్కా ఆనంద్ బాబు వంగలపూడి అనిత
కొనసాగుతున్న స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుపై ఏపీ సీఐడీ విచారణ కొనసాగిస్తుంది. నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఏపీ సీఐడీ పోలీసులు విచారణ చేపట్టారు. అదలా ఉంచితే, నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం కార్యక్రమానికి బ్రేక్ పడింది. మరికొద్ది రోజుల్లో యువగళం కార్యక్రమం మళ్ళీ పున ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ ప్రాంతంలో నిలిచిపోయిన యువగళం పాదయాత్ర వచ్చేవారం నుండి తిరిగి ప్రారంభం కానుందని సమాచారం.