Polling: అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ ప్రారంభం.. భారీగా పోలింగ్‌కు హాజరవుతున్న ప్రజలు
ఈ వార్తాకథనం ఏంటి
అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ప్రజలు తప్పనిసరిగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలోని మొత్తం 296 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. అస్సాంలో ప్రధానంగా భాజపా, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. కేరళలో లెఫ్ట్ కూటమి, కాంగ్రెస్ కూటమి, భాజపా మధ్య ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. పుదుచ్చేరిలో ఎన్డీయే, డీఎంకే కూటములు తలపడుతున్నాయి.
వివరాలు
పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
అస్సాంలో 126 నియోజకవర్గాలకు 31,490 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నుంచి 99 మంది, భాజపా నుంచి 90 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేరళలో 140 నియోజకవర్గాలకు 30,495 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో సుమారు 2.71 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పుదుచ్చేరిలో 30 నియోజకవర్గాలకు 1,099 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేయనున్నారు.