Page Loader
YSRCP: వైఎస్సార్‌సీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా 
YSRCP: వైఎస్సార్‌సీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

YSRCP: వైఎస్సార్‌సీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2024
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీకి మరో షాక్ తగిలింది. గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్యెల్యే కిలారి రోశయ్య రాజీనామా చేశారు. పార్టీకి నష్టం చేసేవారికి వైసీపీలో ప్రమోషన్లు ఇస్తున్నారని రోశయ్య తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ పెద్దలు, తనను మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని వ్యాఖ్యానించారు. ఇలాంటి పార్టీలో కొనసాగడం ఇష్టం లేక రాజీనామా చేస్తున్నట్లు రోశయ్య వెల్లడించారు. తాజాగా కిలారి రోశయ్య రాజీనామా చర్చనీయాంశమైంది.. అయితే రోశయ్య జనసేన పార్టీలోకి వెళతారని ప్రచారం జరుగుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పొన్నూరు వైసిపి మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య రాజీనామా