LOADING...
Vande Mataram: బెంగాల్ విజయం తర్వాత కేంద్రం కీలక నిర్ణయం.. 'వందే మాతరం'కు జాతీయ గీతంతో సమాన హోదా!
'వందే మాతరం'కు జాతీయ గీతంతో సమాన హోదా!

Vande Mataram: బెంగాల్ విజయం తర్వాత కేంద్రం కీలక నిర్ణయం.. 'వందే మాతరం'కు జాతీయ గీతంతో సమాన హోదా!

వ్రాసిన వారు Sirish Praharaju
May 06, 2026
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ సమావేశంలో 'వందే మాతరం'కు జాతీయ గీతం 'జనగణమన'తో సమానమైన చట్టబద్ధ హోదా కల్పించేందుకు ప్రపోజల్‌కు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జాతీయ పతాకం,రాజ్యాంగం అవమానానికి, అలాగే జాతీయ గీతం ఆలాపనకు ఆటంకం కలిగిస్తే శిక్షలు ఉన్నట్లే, ఇక 'వందే మాతరం'కూ అదే రూల్స్ వర్తించేలా చట్టంలో మార్పులు చేయనున్నారు.

వివరాలు 

చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం జాతీయ గీతాన్ని అడ్డుకొంటే.. 

ఈ మార్పులతో 'వందే మాతరం'ను అవమానించడం కూడా కాగ్నిజబుల్ ఆఫెన్స్‌గా పరిగణించబడుతుంది. దేశం 'వందే మాతరం' 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వేళ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం జాతీయ గీతాన్ని అడ్డుకోవడం లేదా అవమానిస్తే మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఇక ఇదే సెక్షన్‌లో 'వందే మాతరం'ను కూడా చేర్చనున్నారు. అదే తప్పును మళ్లీ మళ్లీ చేస్తే కనీసం ఏడాది జైలు శిక్ష తప్పదు.

వివరాలు 

కాంగ్రెస్ పార్టీపై రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు

గత డిసెంబర్‌లో పార్లమెంట్‌లో జరిగిన 'వందే మాతరం 150 సంవత్సరాలు' ప్రత్యేక చర్చలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ గీతానికి జాతీయ గీతంతో సమాన హోదా ఇవ్వాలని బలంగా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీపై ఆయన విమర్శలు కూడా చేశారు. బెంగాల్ సహా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన 'వందే మాతరం'కు ఇప్పటివరకు ప్రత్యేక చట్టబద్ధ రక్షణ లేకపోవడం గమనార్హం. ఈ నిర్ణయం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement