Visakhapatnam KGH: విశాఖ కేజీహెచ్‌లో విద్యుత్ అంతరాయం.. ఒకరి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో నిన్న కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తిరిగి విద్యుత్ పునరుద్ధరించడానికి చాల సమయం పట్టింది. చివరికి కరెంట్ రావడంతో రోగులతో పాటు వారి కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్య సేవలు యధావిధిగా కొనసాగుతున్నాయి. విద్యుత్ సమస్యకు కారణమైన తెగిన కేబుళ్లను సిబ్బంది మళ్లీ పునరుద్ధరించారు. అయితే, మర్రిపాలేనికి చెందిన 45 ఏళ్ల దేవి రాజేంద్రప్రసాద్ వార్డులో చికిత్స పొందుతున్న సమయంలో కరెంట్ నిలిచిపోవడంతో ఆక్సిజన్ సరఫరా అడ్డంకులు ఏర్పడి, ఆమె దురదృష్టవశాత్తు మరణించారు. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
విద్యుత్ నిలిచిపోవడానికి కారణం ఏమిటి?
మార్చురీ వద్ద అండర్‌గ్రౌండ్ పనులు నిర్వహించే క్రమంలో విద్యుత్ కేబుళ్లు దెబ్బతినడంతో కేజీహెచ్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనివల్ల ఆసుపత్రిలోని ప్రధాన వార్డులు చీకట్లో మునిగిపోయాయి. అయితే, ఐసీయూ, వెంటిలేటర్, ఆక్సిజన్‌పై ఆధారపడిన రోగులకు మాత్రం జనరేటర్ ద్వారా అత్యవసర విద్యుత్‌ను అందించారు. అదేవిధంగా, ఇతర వార్డుల రోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ లేకపోవడంతో నీటి సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. రోగులు, వారి కుటుంబ సభ్యులు రాత్రంతా చిమ్మ చీకట్లోనే గడపాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు కేజీహెచ్‌లో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ రాలేదు.