
టీఎస్‌జెన్‌కో, టీఎస్‌ట్రాన్స్‌కో సీఎండీ పదవికి ప్రభాకర్‌రావు రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
టీఎస్ ట్రాన్స్‌కో(Transco), జెన్‌కో (Genco) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పదవికి దేవులపల్లి ప్రభాకరరావు సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సమర్పించారు.
కొత్త ప్రభుత్వం నూతన సీఎండీని నియమించే వరకు ట్రాన్స్‌మిషన్, జనరేషన్ కంపెనీల వ్యవహారాలను టీఎస్ ట్రాన్స్‌కో డైరెక్టర్ (సివిల్)కి ఆయన బాధ్యతలు అప్పగించారు.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో సబ్ క్రిటికల్ టెక్నాలజీపై ప్రభాకర్‌రావుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
ఇదిలావుండగా, విశ్రాంత ఐఏఎస్ అధికారి, మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి కూడా తన పదవికి రాజీనామా చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శికి రాజీనామా అందజేత
D.Prabhakar Rao CMD TRANSCO & TS GENCO resigned from the post. #Telangana pic.twitter.com/h7EGIXFash
— Mubashir.Khurram (@infomubashir) December 4, 2023