Page Loader
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద 
ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2025
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణ నది ఉప్పొంగిపోతోంది. ముఖ్యంగా కృష్ణనది పరివాహక ప్రాంతాల్లో గత వారం రోజులుగా కురుస్తున్నభారీ వర్షాల ప్రభావంతో.. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి పెద్ద మొత్తంలో వరద నీరు చేరుతోంది. ఈపరిస్థితిని గమనించిన అధికారులు అప్రమత్తమై..ఎగువ నుంచి వచ్చే వరద నీటికి అనుగుణంగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇందుకోసం ప్రకాశం బ్యారేజీ వద్ద 25గేట్లను అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విడుదల చేసిన ఈనీరు నేరుగా సముద్రంలోకి చేరుతోంది.ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 20,748 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లోగా వస్తుండగా.. 18,125క్యూసెక్కుల నీటినిదిగువకు విడుదల చేస్తున్నారు. అదేసమయంలో బ్యారేజీ కాల్వల ద్వారా 2,623క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.