
Hyderabad: ఆర్టీసీ బస్సులో ప్రీ-వెడ్డింగ్ షూట్.. మండిపడుతున్న నెటిజన్లు ( వీడియో)
ఈ వార్తాకథనం ఏంటి
పెళ్లి ముందు 'ప్రీవెడ్డింగ్ షూట్' షూట్ అనేది ట్రేండ్‌గా మారిపోయింది.
ఈ క్రమంలో పెళ్లి చేసుకోబోయే జంటతో పాటు, ఫోటో గ్రాఫర్లు కూడా 'ప్రీవెడ్డింగ్ షూట్'ను కొత్త ప్లాన్ చేస్తున్నారు.
కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో అది రివర్స్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి ఉదంతమే తాజాగా హైదరాబాద్‌లో జరిగింది.
హైదరాబాద్‌లో ఓ జంట ప్రీ-వెడ్డింగ్ షూట్‌ను ఆర్టీసీ బస్సులోనే జరుపుకుంది.
బస్సు ట్రాఫిక్‌లో ఆగి ఉన్న సమయంలో ఈ షూట్ చేయడం గమనార్హం.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు.
వారిపై చర్యలు తీసుకోవాలంటూ టీఎస్ఆర్టీసీని ట్యాగ్ చేస్తున్నారు. ట్రాఫిక్‌లో నడిరోడ్డుపై నిలిచిన బస్సులో ప్రీ-వెడ్డింగ్ షూట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
Are Hyderabad roads now the backdrop for pre-wedding tales?
— ⚠☄⚕Bad Drivers of Hyderabad ⛙⛴☣ (@trafficpunisher) January 7, 2024
I'm all in for urban fairy tales, but let’s ensure our roads don't steal the spotlight with unexpected plot twists. Seeking your department's wisdom on this @tsrtcmdoffice@TSRTCHQ @HYDTP #Hyderabad#RoadSafety#Tsrtc pic.twitter.com/mfSTxktmNC