'ఫోన్లను ఓపెన్ చేసేందుకు సిద్ధం'; కవితకు లేఖ రాసిన ఈడీ జాయింట్ డైరెక్టర్
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మంగళవారం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. కవిత సమర్పించిన ఫోన్లను ఓపెన్ చేసేందుకు ఈడీ సిద్ధమైంది. ఈ మేరకు కవిత ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ రాశారు. ఫోన్లను ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజురుకావడమో లేకుంటే తన ప్రతినిధి పంపాలని జాయింట్ డైరెక్టర్ లేఖలో పేర్కొన్నారు. కవిత సమర్పించిన ఫోన్లను ఓపెన్ చేసేటప్పుడు అమె తరఫున బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ హాజరుకానున్నారు.
ఇప్పటికే కవిత బ్యాంక్ స్టేట్మెంట్లు, కీలక పత్రాలను ఈడీ స్వాధీనం
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత మొదటిసారి విచారణకు హాజరైనప్పుడే ఆమె పర్సనల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రెండోసారి ఆమె విచారణకు హాజరైనప్పుడు ఈడీ ఆరోపించిన మిగతా ఫోన్లను కవిత సమర్పించారు. ఇప్పటికే కవితకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లు, కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. దిల్లీ మద్యం కుంభకోణం కేసు కవిత ఫోన్ల చుట్టే తిరుగుతోంది. ఈ క్రమంలో ఆ ఫోన్లో ఏముంది? ఈ కేసు గుట్టును ఆ సెల్ ఫోన్లు విప్పుతాయా? లేదా? అనే చూడాలి.