దిల్లీ మద్యం కేసు: కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(కేసీఆర్) కుమార్తె కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరగనుంది.
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లను సవాల్ చేయడంతోపాటు అరెస్టు నుంచి రక్షణ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. అలాగే మహిళలను ఇంటి వద్దే విచారించాలని అందులో ఆమె పేర్కొన్నారు.
న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ త్రివేది విచారణతో కూడిన దర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనున్నది.
కవిత
ఇప్పటికే కవితను మూడసార్లు విచారించిన ఈడీ
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఇప్పిటకే మూడుసార్లు కవితను విచారించింది.
మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితను ఈడీ విచారించింది.
అరుణ్ రామచంద్ర పిళ్లై.. తాను కవిత బినామీ అని వాంగ్మూలంలో చెప్పారు. ఆమె చెప్పినందు వల్లే తన ఖాతాలోకి 32కోట్లు వచ్చాయని పేర్కొన్నారు. కోటి రూపాయలు కూడా తన ఖాతాలోకి వచ్చినట్లు తెలిపారు.