Bengaluru tech graduate: 'ఉచితంగా పనిచేయడానికి సిద్ధం'.. ఓ యువకుడి వైరల్ పోస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
చదువుపూర్తియై రెండేళ్ల దాటినా ఉద్యోగం రాకపోవడంతొ ఓ టెక్ గ్రాడ్యుయేట్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అనుభవం లేనందున ఎదుర్కొన్న తిరస్కరణలను దృష్టిలో ఉంచుకుని, ఆయన ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ఈ ఆలోచనను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు.
ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. 2023లో ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో బీఈ పూర్తి చేసిన ఓ బెంగళూరు గ్రాడ్యుయేట్ తన రెజ్యుమేను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
'తాను 2023లో ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో బీఈ పూర్తి చేశాను.
Details
ఉచిత సలహాలు ఇస్తున్న నెటిజన్లు
ప్రస్తుతం ఉద్యోగం పొందడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాను. నా రెజ్యుమే పక్కన పెట్టి సాయం చేయండి. ఉచితంగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు.
జావా, పైథాన్, క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్ వంటి కోర్సుల్లో ప్రావీణ్యం ఉన్నట్లు తెలిపారు. ఈ విధంగా పనిచేస్తే కనీసం అనుభవం వస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
ఈ పోస్టుపై పలువురు స్పందించి, సలహాలు, సూచనలు అందించారు. కొంతమంది సీవీని మరింత మెరుగ్గా సిద్ధం చేసుకోవాలని సూచించారు.