LOADING...
Droupadi Murmu: ఈనెల 21న తిరుమల పర్యటనకు రానున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 
ఈనెల 21న తిరుమల పర్యటనకు రానున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

Droupadi Murmu: ఈనెల 21న తిరుమల పర్యటనకు రానున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2025
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీన తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోనున్నారు. ఒక రోజు ముందుగానే ఆమె తిరుచానూరుకు చేరుకుని అక్కడి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమలకి వెళ్లతారు. ఆపై మరుసటి రోజు ఉదయం ఆలయ పరంపర ప్రకారం ముందుగా శ్రీవరాహస్వామి వారికి, తరువాత శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక దర్శనం నిర్వహించనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను దృష్టిలో పెట్టుకుని తితిదే అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, సీవీఎస్‌ఓ మురళీ కృష్ణతో పాటు ఇతర శాఖల అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఈనెల 20, 21వ తేదీల్లో తిరుమలలో పర్యటించనున్న రాష్ట్రపతి ముర్ము