Page Loader
'ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి' అనే సరికొత్త యుద్ధనౌకను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము
'ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి' అనే సరికొత్త యుద్ధనౌకను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము

'ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి' అనే సరికొత్త యుద్ధనౌకను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2023
05:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

సరికొత్త యుద్ధనౌక 'ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి' ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించారు. దీంతో భారత నౌకదళానికి 'ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి'త్వరలోనే సేవలను అందించనుంది. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా కోల్ కతాలోని హుగ్లీ నది ఒడ్డునున్న గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ ఇంజినీర్స్ లిమిటెడ్ ను గురువారం రాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా అధునాతన స్టెల్త్ యుద్ధ నౌకను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. 'ప్రాజెక్టు 17ఏ'లో భాగంగా రూపొందించిన ఆరో యుద్ధనౌక ఇది.

Details

ఐఎన్ఎస్ వింధ్యగిరిలో సరికొత్త గ్యాడ్జెట్లు

ఇదే పేరుతో గతంలో ఉన్న యుద్ధనౌక 31 ఏళ్లపాటు సేవలందించిన విషయం తెలిసిందే. ఐఎన్ఎస్ వింధ్యగిరిలో సరికొత్త గ్యాడ్జెట్ లను అమర్చనున్నారు. దీన్ని నౌకాదాళానికి ఇచ్చే ముందుగా వివిధ రకాలుగా పరీక్షించి చూస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రాజెక్టు 17ఎ లోని నౌకలన్నీ గైడెడ్ మిస్సైల్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఒక్కో నౌక పొడవు 149 మీటర్లు ఉంది. అధునాతన పరికరాలు, ఆయుధాలు, సెన్సార్లు, ఫ్లాట్ ఫాం మేనేజ్ మెంట్ సిస్టమ్ లు వీటిలో పొందుపరిచారు.